రెమ్యూనరేషన్ ఇవ్వలేదని గేమ్ ఛేంజర్ కో డైరెక్టర్ పై కేసు నమోదు!
అయితే ఈ మూవీలో నటించినందుకు గానూ తమకు ఎలాంటి రెమ్యూనరేషన్ అందలేదని సినిమా కో డైరెక్టర్ స్వర్గం శివపై ఆర్టిస్ట్ తరుణ్, తదితరులు గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ సినిమాను ఎలాంటి ముహుర్తంలో మొదలుపెట్టారో తెలియదు కానీ సినిమా మొదలైన దగ్గర నుంచి ఏదొక వివాదం ఎదుర్కొంటూనే ఉంది. రిలీజ్ కు ముందు పలు వివాదాలు ఎదుర్కొన్న గేమ్ ఛేంజర్ సినిమా రిలీజై డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న తర్వాత కూడా వివాదాలు ఈ సినిమాను వీడటం లేదు.
రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, ఎస్జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన గేమ్ ఛేంజర్ సినిమా దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. దిల్ రాజు బ్యానర్ లో 50వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ తర్వాత డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో దీని వల్ల దిల్ రాజు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. గేమ్ ఛేంజర్ లో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు నటించిన విషయం తెలిసిందే.
అయితే ఈ మూవీలో నటించినందుకు గానూ తమకు ఎలాంటి రెమ్యూనరేషన్ అందలేదని సినిమా కో డైరెక్టర్ స్వర్గం శివపై ఆర్టిస్ట్ తరుణ్, తదితరులు గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం గుంటూరు, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు దాదాపు 350 మంది జూనియర్ ఆర్టిస్టులు వెళ్లగా, వారికి ఒక్కొక్కరికి రూ.1200 ఇస్తామని చెప్పి ఒప్పుకున్నాడట కో డైరెక్టర్ స్వర్గం శివ.
కానీ ఇప్పటివరకు దానికి సంబంధించిన డబ్బులు రాలేదని తరుణ్ పోలీస్ స్టేషన్ లో కో డైరెక్టర్ పై కంప్లైంట్ ఇచ్చాడు. ఈ విషయంలో గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు అయినా తమకు న్యాయం చేయాలని జూనియర్ ఆర్టిస్టులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రతీ ఒక్కరూ వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలో జూ.ఆర్టిస్టులకు రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడమేంటని ఆశ్చర్యపోతున్నారు.
మరి దిల్ రాజు ఏమైనా ఈ విషయంలో బహిరంగంగా స్పందిస్తాడా లేదా సైలెంట్ గా బ్యాక్ గ్రౌండ్ లోనే సమస్యను పరిష్కరించుకుంటాడా అనేది చూడాలి. ఏదేమైనా దిల్ రాజుకు మొదటి నుంచే గేమ్ ఛేంజర్ వల్ల చాలా తలనొప్పులు ఎదురయ్యాయి. మొదట్లో షూటింగ్ లేటవడం, తర్వాత తమిళనాడులో రిలీజ్ ఇష్యూస్, రిలీజ్ తర్వాత సినిమాపై సెటైర్లు, అన్నింటికీ మించి డిజాస్టర్ టాక్ తో భారీ నష్టాలు, దానికి తోడు ఐటీ రైడ్స్, ఇప్పుడేమో ఏకంగా కేసు పెట్టడంతో దిల్ రాజు కు గేమ్ ఛేంజర్ మనశ్శాంతి లేకుండా చేస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.