రానా ఫుడ్ స్టోర్... కేజీ టమాటా రూ.4250, ఒక్క కొబ్బరి బొండం రూ.1000
అయితే హైదరాబాద్‌లో భార్యతో కలిసి ఫుడ్ స్టోర్‌ను ప్రారంభించారు. ఇటీవల ప్రముఖుల సమక్షంలో ఈ ఫుడ్ స్టోర్‌ను ప్రారంభించారు.
దగ్గుబాటి ఫ్యామిలీ హీరో రానా ఈమధ్య కాలంలో సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. టాక్ షో, వెబ్ సిరీస్, సోషల్ మీడియా పోస్ట్‌లు ఇలా అనేక రకాలుగా వార్తల్లో ఉంటున్నారు. రానా హీరోగా సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన మాత్రం సినిమాల విషయంలో పెద్దగా ఆసక్తి కనబర్చుతున్నట్లు అనిపించడం లేదు. మంచి కథలు వస్తే సినిమాలు వరుసగా చేస్తాను అంటున్న రానా ఇంకా కొత్త సినిమాను మొదలు పెట్టలేదు. అయితే హైదరాబాద్‌లో భార్యతో కలిసి ఫుడ్ స్టోర్‌ను ప్రారంభించారు. ఇటీవల ప్రముఖుల సమక్షంలో ఈ ఫుడ్ స్టోర్‌ను ప్రారంభించారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఈ స్టోర్‌ను ప్రారంభించడంతోనే సెలబ్రెటీలకు మాత్రమే ఈ ఫుడ్ స్టోర్ అని చెప్పకనే చెబుతున్నారు. అందులో రేట్లు సామాన్యులు కనీసం చూసే విధంగా కూడా లేవు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కేజీ టమాటా రూ.5 నుంచి రూ.20లు ఉంది. ఆర్గానిక్ అయితే రూ.100 వరకు ఉంది. కానీ రానా ఫుల్ స్టాల్‌లో 200 గ్రామ్‌ల టమాట రూ.850లు. అంటే కేజీ టమాటా రూ.4250లు. బాబోయ్ టమాటాకు అంత రేటు ఏంటి రానా భయ్యా అంటూ సోషల్ మీడియాలో రేట్లు చూసిన వారు షాక్ అయ్యి రానాను ప్రశ్నిస్తున్నారు.
టమాట రేట్లు మాత్రమే కాకుండా ఇతర రేట్లు కూడా అలాగే ఉన్నాయి. ఒక కొబ్బరి బొండం రేటు అక్షరాల రూ.1000లు. ఈమధ్య కాలంలో సెలబ్రెటీలు హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏది పడితే అది తినడం లేదు. డబ్బులు ఎలాగూ చేతి నిండా ఉన్నాయి. వెళ్లేప్పుడు ఏమైనా తీసుకు వెళ్తామా అనుకుంటున్నారో ఏమో ఎక్కువగా ఖర్చు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అందుకే ఎంత రేటు పెట్టినా ఆరోగ్యం కోసం కొనుగోలు చేసే వారు ఉంటారు. కనుక రానా ఫుట్ స్టోర్ లో విదేశాల నుంచి అత్యంత నాణ్యమైన ఆర్గానిక్ ఫుడ్ ను అందుబాటులో ఉంచుతున్నారు.
విదేశాల నుంచి వచ్చిన జ్యూస్ మొదలుకుని అత్యంత ఖరీదైన చీజ్‌ల వరకు అక్కడ లభిస్తున్నాయి. ఒక గ్లాస్ చెరకు రసం రూ.275లు. రానా, మిహిక దంపతులు ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ స్టోర్‌ను ఇటీవల దర్శకుడు రాజమౌళి భార్య రమా రాజమౌళి సందర్శించారు. అత్యంత ఖరీదైన ఈ ఫుడ్ ఇతర దేశంలోని ప్రముఖ నగరాలు, పట్టణాల నుంచి తెప్పించారు. ముందు ముందు మరిన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్‌ను అందుబాటులో ఉంచబోతున్నట్లు చెబుతున్నారు. ఈ ఫుడ్ స్టోర్ సంగతి తర్వాత కానీ సినిమా ఎప్పుడు రానా అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.