దుబాయ్‌లో టాలీవుడ్ తారల సందడి
ఈ వెడ్డింగ్ కు నమ్రత మాత్రమే కాదు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సినిమాల్లో నటించకపోయినా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అందరితో ఎంత సన్నిహితంగా ఉంటుందో తెలిసిందే. తాజాగా నమ్రత దుబాయ్ లో జరుగుతున్న ఓ ప్రైవేట్ వెడ్డింగ్ కు వెళ్లింది. ఈ వెడ్డింగ్ కు నమ్రత మాత్రమే కాదు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.
టాలీవుడ్ లో ప్రముఖ భక్తి చిత్రాలను నిర్మించిన AMR గ్రూప్ ఛైర్మన్, A. మహేష్ రెడ్డి కొడుకు పెళ్లి దుబాయ్ లో జరుగుండగా, ఆ పెళ్లికి తెలుగు సినీ తారలతో పాటూ రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపార వేత్తలు హాజరయ్యారు. దుబాయ్ లో ఎంతో గ్రాండ్ గా జరుగుతున్న ఈ పెళ్లి నుంచి నమ్రత తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోల్లో నమ్రత జూ. ఎన్టీఆర్ తో ఓ ఫోటోను, ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో ఓ ఫోటోను పోస్ట్ చేయగా, ఉపాసన, రామ్ చరణ్ జంటతో ఓ పిక్ ను పోస్ట్ చేసింది. అయితే నమ్రతతో పాటూ ఈ పెళ్లికి మహేష్ బాబు వెళ్లకపోయినా వారి కూతురు సితార మాత్రం హాజరైంది. సితారతో పాటూ డైరెక్టర్ సుకుమార్ కూతురు కూడా ఈ పెళ్లికి హాజరైనట్టు నమత్ర షేర్ చేసిన ఫోటోలను బట్టి తెలుస్తోంది.
మొత్తానికి దుబాయ్ లో జరుగుతున్న మహేష్ రెడ్డి కొడుకు పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరుగుతున్న విషయం నమ్రత ఫోటోలను చూస్తుంటే అర్థమైపోతుంది. టాలీవుడ్ లో రీసెంట్ గా జరిగిన గ్రాండ్ వెడ్డింగ్స్ లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుందని చెప్తున్నారు. టాలీవుడ్ లోని తారతంతా ప్రస్తుతం ఈ పెళ్లి కోసం దుబాయ్‌లోనే ఉన్నారు.