మాస్ కా దాస్ తో డ్రాగన్ బ్యూటీ..?

రీసెంట్ గా రిలీజైన ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ అదే తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలో నటించిన కయదు లోహార్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు.

Update: 2025-02-24 12:08 GMT

రీసెంట్ గా రిలీజైన ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ అదే తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలో నటించిన కయదు లోహార్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. సినిమా సక్సెస్ లో కథ కథనం ఎంత ఇంపార్టెంటో నటీనటులు కూడా అంతే ప్రాముఖ్యత వహిస్తారు. ఈ క్రమంలో డ్రాగన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఒక హీరోయిన్ గా నటించగా సెకండ్ హాఫ్ లో కయదు లోహార్ ఎంట్రీ అదిరిపోతుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన డ్రాగన్ సినిమాలో కయదు ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది.

సినిమాలో అమ్మడి లుక్స్, యాక్టింగ్ అంతా పర్ఫెక్ట్ గా అనిపించింది. అమ్మడి ఫీచర్స్ చూసిన ఎవరైనా సరే స్టార్ మెటీరియల్ అనేస్తున్నారు. ఐతే కయదు లోహార్ తొలి సినిమా డ్రాగన్ అనుకుంటున్నారు కానీ అమ్మడు ఆల్రెడీ నాలుగేళ్ల నుంచి సినిమాలు చేస్తుంది. 2021 లో కన్నడలో ముగిల్పేటే సినిమాలో నటించిన అమ్మడు 2022 లో శ్రీ విష్ణుతో అల్లూరి సినిమాలో కూడా నటించింది.

ఐతే ఆ సినిమా సరిగా ఆడకపోవడం వల్ల అమ్మడిని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు డబ్బింగ్ సినిమా డ్రాగన్ తో అమ్మడు సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు యూత్ ఆడియన్స్ అయితే కయదు ఫ్యాన్స్ గా మారిపోయారు. పర్ఫెక్ట్ బాడీ షేప్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ఉంది ఈ అమ్మడు. గ్లామర్ తో పాటు యాక్టింగ్ లో కూడా టాలెంట్ చూపిస్తున్న ఈ చిన్నది ఇప్పుడు తెలుగులో లక్కీ ఛాన్స్ అందుకుంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అనుదీప్ కెవి కాంబినేషన్ లో ఫంకీ సినిమా వస్తుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా మొన్నటిదాకా ఆషిక రంగనాథ్, కృతి శెట్టిల పేర్లు వినపడ్డాయి. కానీ ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ కయదు లోహార్ ని సంప్రదించినట్టు తెలుస్తుంది. విశ్వక్ సేన్ సినిమాలో కయదు దాదాపు ఓకే అయినట్టే అని తెలుస్తుంది. తెలుగులో అల్లూరి చేసినా పెద్దగా ఆకట్టుకోలేని కయదు లోహార్ డబ్బింగ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకుని ఇప్పుడు మళ్లీ విశ్వక్ ఫంకీ తో రీ ఎంట్రీ ఇస్తుంది. మరి ఈ సినిమాతో అమ్మడు ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో చూడాలి. డ్రాగన్ రిలీజైన టైం నుంచి సోషల్ మీడియాలో కయదు గురించి ఎక్కువ చర్చ నడుస్తుండటం విశేషం.

Tags:    

Similar News