పిక్‌టాక్ : స్కిన్ టైట్ వైట్‌లో మలైకా అందం
సోషల్ మీడియాలో ఇప్పటికీ తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ ఉండే మలైకా అరోరా మరోసారి తన నెట్టింట తన వైట్ డ్రెస్ అందంతో ఆకట్టుకుంది.
హిందీ సినీ ప్రేమికులకు మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కేవలం హిందీలోనే కాకుండా ఇతర భాషల్లోనూ తన అందంతో ఉర్రూతలూగించిన ముద్దుగుమ్మ మలైకా. తక్కువ సమయంలోనే బాలీవుడ్‌తో పాటు దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ మలైకా. అయిదు పదుల వయసు దాటినా ఇంకా పాతికేళ్ల పడుచు అమ్మాయి మాదిరిగా అందాల ఆరబోత చేసే ముద్దుగుమ్మ అంటూ మలైకా అరోగా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. యంగ్ హీరోతో ఈమె రిలేషన్‌లో ఉందనే వార్తలు గతంలో వచ్చాయి. అప్పుడు ఇప్పుడు ఈమె అందం గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది.
మహారాష్ట్రలోని థానేలో జన్మించిన మలైకా అరోరా చెంబూర్‌లోని స్వామి వివేకానంద స్కూల్‌లో సెకండరీ విద్యను పూర్తి చేసింది. థానేలోని హోలీ క్రాస్ హైస్కూల్‌లోను చదివింది. చర్చిగేట్‌లోని జై హింద్ కాలేజ్‌లో కాలేజ్ విధ్యను అభయసించింది. మోడలింగ్‌పై ఆసక్తితో చిన్న వయసులోనే అటు వైపు అడుగులు వేసింది. దాంతో కాలేజ్ విద్యను మధ్యలోనే వదిలేసింది. తక్కువ సమయంలోనే మోడల్‌గా మంచి గుర్తింపు దక్కించుకుంది. నటిగా బాలీవుడ్‌లో మలైకా 1997లో ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడికి 1998లో దిల్ సే లో చేసిన చయ్య చయ్య సాంగ్ మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.
ఆ పాట తర్వాత బాలీవుడ్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాల్లో కనిపించింది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాల సంఖ్య తగ్గిస్తూ వచ్చింది. మలైకా ఓకే చెప్పాలే కానీ ఏడాదికి పది సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చేవి అంటారు. కానీ మలైకా మాత్రం ఎక్కువ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించలేదని అంటారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ ఉండే మలైకా అరోరా మరోసారి తన నెట్టింట తన వైట్ డ్రెస్ అందంతో ఆకట్టుకుంది.
టైట్ వైట్ డ్రెస్‌లో మలైకా మరోసారి పాతికేళ్ల పడుచు అమ్మాయి అన్నట్లుగా అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి అందం ఉన్నా ఎందుకు ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరో పదేళ్లు అయినా మలైకా అందం తగ్గదని, ఆమె ఫిజిక్ అంతే ఫిట్‌గా ఉంటుందని అభిమానులు ఈ ఫోటోకు తెగ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు లో ఈమె చేసిన గబ్బర్ సింగ్ కేవ్వు కేక పాట ఇప్పటికీ ఓ రేంజ్‌లో ఊపు ఊపేస్తున్న విషయం తెల్సిందే.