ప్రభుదేవా ఈవెంట్ లో అలనాటి తారల రీయూనియన్
నటుడిగా, కొరియోగ్రఫర్ గా, డైరెక్టర్ గా ఇండస్ట్రీలో పలు రంగాల్లో రాణిస్తున్నాడు ప్రభుదేవా.
నటుడిగా, కొరియోగ్రఫర్ గా, డైరెక్టర్ గా ఇండస్ట్రీలో పలు రంగాల్లో రాణిస్తున్నాడు ప్రభుదేవా. ఎన్నో సూపర్ హిట్ పాటలకు కొరియోగ్రఫీ చేసిన ప్రభుదేవా, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి దర్శకత్వం కూడా వహించాడు. పలు భాషల్లో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్నాడు ప్రభుదేవా.
ఇదిలా ఉంటే తాజాగా ప్రభుదేవా చెన్నైలో ఓ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం చేశాడు. ప్రభుదేవా లైవ్ డ్యాన్స్ వైబ్ పేరిట ఓ కాన్సర్ట్ ను నిర్వహించాడు. ఈ కాన్సర్ట్ కు ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు వచ్చి సందడి చేశారు. అలనాటి సీనియర్ హీరోయిన్లు రోజా, మీనా, సంగీత, మహేశ్వరి, రంభ, శ్రీదేవి విజయ్ కుమార్ ఈ ఈవెంట్ లో పాల్గొని సరదాగా గడిపారు.
ఈ ఈవెంట్ లో దిగిన ఫోటోలను హీరోయిన్ మీనా తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మామూలుగా అప్పుడప్పుడు సీనియర్ హీరోయిన్లంతా ఇలా అనుకోకుండా కలిస్తూ ఉంటారు. అలా కలిసినప్పుడు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వాటిని వైరల్ అయ్యేలా చేస్తారు.
ఈ ఈవెంట్ కు వచ్చిన హీరోయిన్లంతా ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన వాళ్లే. స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఆడియన్స్ ను మెప్పించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. వీరిలో మహేశ్వరి తప్ప మిగిలిన వారంతా ఇప్పటికీ ఏదొక రూపంలో అభిమానుల ముందుకు వస్తూ వారిని అలరిస్తూనే ఉన్నారు.
అయితే ఈ హీరోయిన్లు కేవలం ప్రభుదేవా లైవ్ డ్యాన్స్ వైబ్ ఈవెంట్ కు హాజరవడమే కాకుండా ఆయనతో కలిసి స్టెప్పులు కూడా వేశారు. రోజా, మీనా ఈ ఈవెంట్ లో స్టెప్పులేసిన ఫోటోలను కూడా మీనా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇదే వేదికపై తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా ప్రభుదేవాతో కలిసి రౌడీ బేబీ సాంగ్ కు స్టెప్పులేశాడు. దానికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తుంది.