డ్రాగన్ ఎక్కేశాడు.. కానీ..!?

భాషాబేధం లేకుండా ఎలాంటి సినిమా వచ్చినా ఆదరించి సూపర్ హిట్ చేయడం తెలుగు ప్రేక్షకుల దగ్గర ఉన్న మంచితనం.

Update: 2025-02-24 16:49 GMT

భాషాబేధం లేకుండా ఎలాంటి సినిమా వచ్చినా ఆదరించి సూపర్ హిట్ చేయడం తెలుగు ప్రేక్షకుల దగ్గర ఉన్న మంచితనం. వీకెండ్ రిలీజ్ అయ్యే సినిమా అది ఏ జోనర్ కథ ఏంటి అందులో హీరో ఎవరు ఇవన్నీ కాదు అది మెప్పించేలా ఉందా లేదా అన్నది చూస్తారు. ఒకవేళ నచ్చింది అంటే తెలుగు ఆడియన్స్ తమ భుజాన ఆ సినిమాను మోస్తారు. ఇలా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. లేటెస్ట్ గా ఈ వారం వచ్చిన డ్రాగన్ అదే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాకు ప్రేక్షకులు జేజేలు కొడుతున్నారు.

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా యూత్ ఫుల్ కథే.. ప్రస్తుతం యువత ఎలా ఉంది అన్నది చూపిస్తూ హీరో క్యారెక్టర్ రాసుకున్నాడు డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు. ఐతే యూత్ ఫుల్ కథే అయినా లైఫ్ కి కావాల్సిన లెసన్ ని ఇచ్చాడు దర్శకుడు. యూత్ ఫుల్ కథతో ఇలాంటి ఎమోషన్స్ ఉన్న సినిమాలు ఇదివరకు కూడా వచ్చాయి. ఐతే ఇది వాటిల్లో కచ్చితంగా ప్రత్యేకమని చెప్పొచ్చు. అందుకే ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథ్ ఆల్రెడీ లవ్ టుడే తోనే యూత్ పల్స్ పట్టేసిన ఈ హీరో ఈ డ్రాగన్ తో నెక్స్ట్ లెవెల్ అనిపించేశాడు. ముందు ఎలాంటి బాధ్యత లేని పోకిరిగా కనిపించి ఒక స్టేజ్ కి వచ్చాక ఆ బాధ్యతలను నిలబెట్టుకునేందుకు పడే తపన బాగా కనబరిచాడు. లవ్ టుడే క్రేజ్ కూడా తోడవడం వల్ల డ్రాగన్ సినిమాకు ప్లస్ అయ్యింది.

డ్రాగన్ అదే డి రాఘవన్ పాత్రలో ప్రదీప్ రంగనాథ్ సూపర్ ఎనర్జీ చూపించాడు. పోకిరి వేశాలే కాదు ఎమోషనల్ సీన్స్ లో కూడా కళ్ల నీళ్లు పెట్టించేలా చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో తండ్రి కాళ్ల మీద పడే సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించేస్తుంది. ప్రదీప్ కి పర్ఫెక్ట్ సినిమాగా డ్రాగన్ అదుర్స్ అనిపించేసింది.

డ్రాగన్ సినిమా తెలుగులో కూడా యూత్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఒక సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే అది యూత్ ఆడియన్స్ కు దగ్గరవ్వాలి. రెగ్యులర్ సినీ గోయర్స్ కన్నా యువత సినిమా మెచ్చితే ఆ రిజల్ట్ వేరేలా ఉంటుంది. రిటర్న్ ఆఫ్ డ్రాగన్ సినిమా అలానే కనెక్ట్ అయ్యింది. అంతేకాదు ఇది తమిళ సినిమానే కానీ ఎక్కడ ఆ ఫ్లేవర్ కనిపించలేదు. తమిళ సినిమానే అయినా యువత సినిమా కాబట్టే అంతగా కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు.

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లో మరో ఎట్రాక్టింగ్ పాయింట్ హీరోయిన్స్ అనుపమ పరమేశ్వరన్, కయదు లోహార్. అనుపమకు తెలుగు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆమె చేసే సినిమాలు ఎలా ఉన్నా ఇక్కడ ఆమె ఫ్యాన్స్ సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. ఇక డ్రాగన్ లో కయదు లోహర్ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. సినిమాలో ఆమె గ్లామర్ పర్ఫార్మెన్స్ అంతా కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది. డ్రాగన్ సినిమా చూసి కయదు ని ఫాలో అవుతున్న ఆడియన్స్ ఎంతోమంది ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు.

రిటర్న్ ఆఫ్ డ్రాగన్ సినిమా దర్శకుడు అశ్వత్ మరిముత్తు ఇంతకుముందు ఓ మై కడవులే సినిమా చేశాడు. దాన్ని తెలుగులో ఓరి దేవుడా అని అతనే రీమేక్ చేశాడు. ఎంచుకున్న కథను ఎలా నడిపించాలో ఒక సినిమా అనుభవంతోనే బాగా తెలుసుకున్నాడు అశ్వత్. రిటర్న్ ఆఫ్ డ్రాగన్ సినిమాలో కూడా అతని రైటింగ్ అదిరిపోయింది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ సూపర్ గా వర్క్ అవుట్ అయ్యేలా చేశాడు. ఆ సీన్ లో డైలాగ్స్ కూడా డైరెక్ట్ ఆడియన్స్ హృదయాన్ని టచ్ చేస్తాయి. అంతగా అశ్వత్ వర్క్ ప్రేక్షకుడికి నచ్చింది.

డ్రాగన్ గా తమిళ్ లో రిటర్న్ ఆఫ్ డ్రాగన్ గా తెలుగులో రిలీజైన ఈ సినిమా అక్కడ ఇక్కడ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఐతే తమిళంలో పోల్చితే తెలుగులో కొందరు రివ్యూయర్స్ సినిమాకు యావరేజ్ అంటూ తేల్చిపారేశారు. అఫ్కోర్స్ ఎవరి వ్యూ వారిది అయినా ఈ సినిమా కోర్ పాయింట్ డైరెక్టర్ ఎగ్జిక్యూషన్ కాస్ట్ అండ్ క్రూ ఈఫర్ట్ ఎక్కడా కూడా లైన్ తగ్గలేదు. అందుకే సినిమాకు తెలుగులో కూడా వసూళ్లు అదిరిపోయాయి. సండే ఐతే తెలుగులో చాలా చోట్ల మంచి ఆక్యుపేషన్ సాధించింది.

తమిళ డబ్బింగ్ సినిమా అన్న చిన్న చూపా లేదా మరో కారణమా అన్నది తెలియదు కానీ సినిమా బాగున్నా ఏదో యావరేజ్ యూత్ కంటెంట్ అన్నట్టుగా కొందరు చెప్పడం విశేషం. ఐతే అవేవి సినిమా వసూళ్లకు అడ్డు పడలేదు. మైత్రి ద్వారా రిలీజైన ఈ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు రాబడుతుంది.

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ప్రదీప్ రంగనాథ్ చూస్తుంటే మరో ధనుష్ లాంటి హీరోగా మారేలా ఉన్నాడని కొందరు అంటున్నారు. చూస్తుంటే అది నిజమే అనిపించేలా ఉంది. షార్ట్ ఫిలింస్ తో మొదలైన తన ప్రయాణాన్ని సిల్వర్ స్క్రీన్ పై దర్శకుడు హీరోగా మొదలు పెట్టి రెండిటిలో కూడా ది బెస్ట్ అనిపించుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో ప్రదీప్ ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తాడని చెప్పొచ్చు.

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సక్సెస్ తో మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ రంగనాథన్ పై కన్నేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ హీరో క‌మ్ డైరెక్టర్ తో భారీ డీల్ సెట్ చేసుకున్నారని టాక్.

మొత్తానికి బెస్ట్ ఎఫర్ట్ తో యూత్ ఫుల్ సినిమాతో వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారని రిటర్న్ ఆఫ్ డ్రాగన్ ప్రూవ్ చేసింది. ఐతే తెలుగులో ఈ సినిమాకు మీడియా రివ్యూస్ కొన్ని మాత్రమే బాగున్నా ఆడియన్స్ వాటిని పట్టించుకోకుండా సినిమాను సూపర్ హిట్ చేశారు. అందరు ఎప్పుడూ చెబుతున్నట్టుగా సినిమాలో కంటెంట్ ఉంటే అది ఆడియన్స్ కి నచ్చితే మధ్యలో ఎవరేం రివూ చెప్పినా ఎవరెంత రేటింగ్ ఇచ్చినా ఆడియన్స్ వాటిని లెక్క చేయరని రిటర్న్ ఆఫ్ డ్రాగన్ తో మరోసారి ప్రూవ్ అయ్యిందని చెప్పొచ్చు.

Tags:    

Similar News