రకుల్ ప్రీత్ సింగ్.. మోడ్రన్ లుక్‌లో అదిరిపోయే స్టైల్!
రకుల్ ప్రీత్ సింగ్.. ఎప్పుడూ కూడా తన గ్లామర్ స్టైల్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసే హీరోయిన్.
రకుల్ ప్రీత్ సింగ్.. ఎప్పుడూ కూడా తన గ్లామర్ స్టైల్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసే హీరోయిన్. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోషూట్ ఇమేజస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. తెల్లటి కార్సెట్ టాప్, బ్లాక్ కార్గో ప్యాంట్ ధరించి, స్టైలిష్ పోజులతో రకుల్ ఆకట్టుకుంటోంది. ఆమె తన ఫేవరేట్ అవుట్‌ఫిట్ అంటూ ఈ ఫోటోలను షేర్ చేయడం, నెటిజన్లను మరింత ఆకర్షిస్తోంది.
ఫొటోల్లో రకుల్ ప్రీత్ సింగ్ తన లుక్‌కి మోడ్రన్ టచ్ ఇస్తూ సింపుల్ యట్ క్లాసీ స్టైల్‌లో కనిపించింది. ఆమె ధరించిన వైట్ కార్సెట్ టాప్ ఆమె ఫిట్‌నెస్‌ను హైలైట్ చేస్తోంది. ముఖ్యంగా నడుము వయ్యారాలు మరింత హైలెట్ అవుతున్నాయి. బ్లాక్ ప్యాంట్‌తో కలిపిన ఈ అవుట్‌ఫిట్ ఆమె లుక్‌కి మరింత బూస్ట్ ఇచ్చింది. మెటాలిక్ హాండ్ జ్యూవెల్రీ, హూప్ ఇయర్రింగ్స్, స్టైలిష్ షూస్ తో ఆమె లుక్ మెరిసిపోతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటోలను పంచుకుంటూ, ఇలా ఉండే అవుట్ ఫిట్స్ నా ఫెవరేట్ అనే క్యాప్షన్ ఇచ్చింది రకుల్. ఈ లుక్‌లో ఆమె తన సొగసుతో మాత్రమే కాకుండా, తన కాన్ఫిడెన్స్ తో కూడా మెరిసిపోతుంది. ఆమె చూపులు, ఎక్స్‌ప్రెషన్స్ ఈ ఫొటోలకు మరింత లైఫ్ ఇస్తున్నాయి. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్‌లో బిజీగా ఉంది. బాలీవుడ్‌లో కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తూనే, సౌత్ చిత్ర పరిశ్రమలో కూడా తన గుర్తింపు కాపాడుకుంటోంది. ఈ ఫొటోషూట్ ఆమె ఫ్యాషన్ సెన్స్‌ను మరోసారి నిరూపించాయి.
ఇక చివరగా తెలుగులో అమ్మడు 2021లో కొండపొలం అనే సినిమాలో కనిపించింది. ఆ తరువాత బాలీవుడ్ లో అలాగే తమిళంలో బిజీగా కనిపించింది. ముఖ్యంగా ఆమె ఆశలు పెట్టుకున్న కొన్ని సినిమాలు సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇండియన్ 2 బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలివడం కూడా ఆమె కెరీర్ పై ప్రభావం చూపింది. మరి రాబోయే ఇండియన్ 3తో అయినా అమ్మడు ఫామ్ లోకి వస్తుందో లేదో చూడాలి.