ఆర్య మిస్టర్ 'ఎక్స్'.. మనల్ని కాపాడే సీక్రెట్ ఏజెంట్!
కోలీవుడ్ స్టార్ హీరో ఆర్యకు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. వివిధ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరై సూపర్ ఫేమ్ సంపాదించుకున్నారు
కోలీవుడ్ స్టార్ హీరో ఆర్యకు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. వివిధ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరై సూపర్ ఫేమ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు మిస్టర్ ఎక్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మనూ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రంలో మంజు వారియర్, గౌతమ్, అనఘ, అతుల్య రవి కూడా నటిస్తున్నారు.
అయితే ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఇప్పటికే తమిళ్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగు టీజర్ ను సోమవారం సాయంత్రం తీసుకొచ్చారు. భారతీయ గూఢచారుల జీవితాల ఆధారంగా సినిమా రూపొందించినట్లు టీజర్ స్టార్టింగ్ లో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. న్యూక్లియర్ డివైజ్ చుట్టూ సినిమా తిరుగుతుందని అర్థమవుతోంది.
దేశాన్ని కాపాడడం మన పని మాత్రమే కాదు.. మన బాధ్యత అంటూ బ్యాక్ గ్రౌండ్ లో మంజు వారియర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అయింది. దేశానికి చెందిన ఒక న్యూక్లియర్ డివైజ్ మిస్ అవ్వగా, శత్రువులకు అది తెలుస్తుంది. దాని వల్ల ఎక్కడైనా ఎటాక్ జరిగే అవకాశం ఉంటుంది. దీంతో దానిని కాపాడే పని స్టార్ట్ అవుతుంది.
అప్పుడు మిస్టర్ ఎక్స్ ను రంగంలోకి దించుతారు. మన దేశానికి తెలియకుండా మన దేశాన్నే కాపాడే సీక్రెట్ ఏజెంట్ అంటూ మేకర్స్ పరిచయం చేస్తారు. అందులో ఒక ఏజెంట్ ఆర్య. మరి చివరకు ఏం జరిగింది? న్యూ క్లియర్ డివైజ్ ను కాపాడారా? సీక్రెట్ మెషీన్ కు ఆర్య కుటుంబానికి సంబంధమేంటి? ఈ విషయాలే సినిమాగా టీజర్ ద్వారా తెలుస్తుంది.
అయితే స్పై ఏజెంట్ గా ఆర్య సూపర్ గా సూట్ అయ్యారు. ఆయన లుక్ అండ్ కటౌట్ పర్ఫెక్ట్ గా సరిపోయింది. గౌతమ్ కార్తీక్ మిస్టరీ మ్యాన్ లా కనిపించి మెప్పించారు. నటి మంజు వారియర్ తన యాక్షన్ తో అదరగొట్టారు. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. విజువల్స్ హై-ఇంటెన్సిటీ తో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
విజువల్స్ కు కరెక్ట్ గా సూట్ అయ్యే ధిబు నినాన్ థామస్ థ్రిల్లింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉత్కంఠ రేపుతోంది. టీజర్ కు మెయిన్ అసెట్ గా మారింది. ఏదేమైనా టీజర్.. యాక్షన్ తో అదిరిపోయింది. సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే మూవీ థియేటర్లలో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. మరి ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.