బ్లాక్ బస్టర్ గా 'డ్రాగన్'.. రూ.100 కోట్లు పక్కానా!
కోలీవుడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్.. లవ్ టుడే మూవీతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన విషయం తెలిసిందే. తన డెబ్యూ సినిమాతోనే అటు తమిళంలో.. ఇటు తెలుగులో మంచి హిట్ ను సాధించారు.
కోలీవుడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్.. లవ్ టుడే మూవీతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన విషయం తెలిసిందే. తన డెబ్యూ సినిమాతోనే అటు తమిళంలో.. ఇటు తెలుగులో మంచి హిట్ ను సాధించారు. తన యాక్టింగ్ తో మెప్పించారు. ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రంతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన ఆ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది.
అయితే వరల్డ్ వైడ్ గా 1500 స్క్రీన్లలో, ఇండియాలో 1000 స్క్రీన్సలో సినిమా రిలీజ్ అవ్వగా.. తమిళంలో ఏజీఎస్ సొంతంగా విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్ గా విడుదల చేసింది. ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. అన్ని సెంటర్స్ లో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
తొలిరోజు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ.. మోస్తరు వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. కానీ అంచనాలు తలకిందులు చేసి రెట్టింపు వసూళ్లను రాబట్టింది. అయితే ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రూ.45 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.5.5 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.
దీంతో వీకెండ్ కల్లా రూ.100 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ చెబుతున్నారు నెటిజన్లు. నవ్విస్తూనే మంచి మెసేజ్ ఇచ్చిన మూవీ అని కొనియాడుతున్నారు. ప్రదీప్ మరిన్ని హిట్స్ కొట్టాలని ఆశిస్తున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. యూత్ ఫుల్ లవ్ డ్రామాగా అశ్వత్ మారుముత్తు తెరకెక్కించగా.. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కళాపతి నిర్మించారు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, కాయడు లోహర్ ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటించారు. ప్రముఖ దర్శకులు కేఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటించారు.
నటి స్నేహ గెస్ట్ రోల్ లో మెరిశారు. జార్జ్ మార్యన్, ఇందుమతి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా నికేత్ బొమ్మిరెడ్డి వ్యవహరించారు. ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. మొత్తానికి రూ.40 కోట్ల బడ్జెట్ తో రూపొందిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ అందరినీ ఓ రేంజ్ లో మెప్పిస్తోంది. మరి మీరు చూశారా?