రెడ్డిగారు అజ్ఞాతం వీడేదెప్పుడు?
సూరి స్టోరీకి పీకే ఒకే చెప్పినట్లు వినిపించింది. కానీ అదెప్పుడు పట్టాలెక్కాలి. సెట్స్ లో ఉన్న సినిమాలే పూర్తవ్వలేదు.;

'ఏజెంట్' ప్లాప్ తర్వాత సురేందర్ రెడ్డి ఎక్కడా కనిపించని సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ అయి రెండేళ్లు గడుస్తుంది. కానీ ఇంత వరకూ సూరి కొత్త సినిమా అప్ డేట్ ఏదీ ఇవ్వలేదు. దీంతో సురేందర్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఎలాంటి సినిమా తో బౌన్స్ బ్యాక్ అవుతున్నాడు? అనే చర్చ ఫిలిం సర్కిల్స్ లో జోరుగా సాగుతుంది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ తో సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది.
సూరి స్టోరీకి పీకే ఒకే చెప్పినట్లు వినిపించింది. కానీ అదెప్పుడు పట్టాలెక్కాలి. సెట్స్ లో ఉన్న సినిమాలే పూర్తవ్వలేదు. ఈనేపథ్యంలో సూరితో సినిమా ఇప్పట్లో సాధ్యమేనా? అన్న సందేహం అర్దవంతమైందే. ఆ సంగతి పక్కనబెడితే సూరి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోవడంతో ఆయనో ఆజ్ఞాత వాసిగా మారిపోయారు. ఆయన ఇండస్ట్రీలో ఉన్నారా? లేక లాంగ్ గ్యాప్ లో భాగంగా ఎక్కడికైనా వెళ్లారా? అన్న సందేహాలు సైతం మొదలయ్యాయి.
సూరి కంబ్యాక్ ఎలా ప్లాన్ చేస్తున్నాడు? అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్. కమర్శియల్ చిత్రాల్లో సూరి బ్రాండ్ ఎప్పుడో వేసేసాడు. 'అతనొక్కడే', 'కిక్', 'ఊసరవల్లి', ' రేసుగుర్రం', 'ధృవ' లాంటి హిట్ సినిమాలతో తన బ్రాండ్ వేసాడు. 'సైరా నరసింహారెడ్డి' లాంటి చారిత్రాత్మక చిత్రంతోనూ సూరి స్పెషాల్టీ చాటి చెప్పాడు. సూరి కేవలం కమర్శియల్ చిత్రాల దర్శకుడే కాదు చరిత్రలను సైతం అద్భుతంగా తీయగలడని నిరూపించాడు.
అలాంటి సూరి ఒక్కసారిగా సైలెంట్ అవ్వడం అభిమానుల్లో చర్చకు దారి తీస్తుంది. మరి నిశ్శబ్దం వెనుక భారీ విస్పోటనం ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా? అన్నది తెలియాలి. సూరి కేవలం స్టార్ హీరోలే కావాలని కూర్చునే దర్శకుడు కాదు. అందుబాటులో ఉన్న హీరోలతోనూ పనిచేస్తాడు. మరి సూరి టచ్లోకి వచ్చే హీరో ఎవరవుతాడో? చూడాలి.