అలా చేయడం మానుకోవాలి... హీరోయిన్ మాస్ వార్నింగ్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎంపీగా ఎన్నిక అయిన తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు. తన ఎమర్జెన్సీ సినిమా ప్రమోషన్ సమయంలోనూ కంగనా ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎంపీగా ఎన్నిక అయిన తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు. తన ఎమర్జెన్సీ సినిమా ప్రమోషన్ సమయంలోనూ కంగనా ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. ఎంపీగా ఉన్న కారణంగా ఆమె ఎక్కువగా సినిమాల గురించి స్పందించడం లేదు. నటిగా కూడా ఈమె ఎక్కువ సినిమాలు చేయడం లేదు. కంగనా సైలెంట్‌గా ఉందని అభిమానులు వాపోతున్న సమయంలో అనూహ్యంగా బాలీవుడ్‌పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది. మీరు చేస్తున్నది ఏమాత్రం బాగాలేదు అంటూ కొందరు ఫిల్మ్ మేకర్స్‌కి మాస్ వార్నింగ్ ఇచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... సన్యా మల్హోత్ర ప్రధాన పాత్రలో నటించిన 'మిసెస్' అనే సినిమా ఇటీవల జీ5లో స్ట్రీమింగ్ అయింది. సినిమాలో ఫ్యామిలీ విలువలు పాటించక పోవడంతో పాటు, ఉమ్మడి కుటుంబం వల్ల ఇబ్బందులు, గొడవలు అంటూ చూపించే ప్రయత్నం చేశారు. ఉమ్మడి కుటుంబాల్లో ఉండే పెద్దలను తప్పుగా చూపించడంతో పాటు, వారిని అవమానించే విధంగా సన్నివేశాలు ఉన్నాయట. దాంతో కంగనా రనౌత్ ఇండైరెక్ట్‌గా మిసెస్ సినిమాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలీవుడ్ సినిమాల తీరును, సినిమాల్లో ఉంటున్న ఫ్యామిల ఇష్యూస్ గురించి కంగనా తనదైన శైలిలో స్పందించి ఘాటుగా విమర్శలు చేసింది.
కంగనా స్పందిస్తూ... ఉమ్మడి కుటుంబాల్లో ఉండే పెద్దలను తప్పుగా చూపించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇకపై అయినా అలాంటివి చేయకుండా ఉండాలి. కుటుంబ వ్యవస్థను నాశనం చేసే విధంగా కొందరు సినిమాలను తీస్తున్నారు. కుటుంబంలో ఉండే పెద్దల గురించి గొప్పగా చెప్పాలి. వారు కుటుంబం మొత్తానికి మానసిక ధైర్యం ఇస్తూ ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు విలువలు నేర్పిస్తూ ఉంటారు. మహిళలు కొన్ని సార్లు పెద్ద వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. అంత మాత్రాన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కరెక్ట్ కాదు, కుటుంబ పెద్దల తీరు సరికాదు, అందరూ మంచి వారు కాదు అనడం ఏమాత్రం కరెక్ట్ కాదని కంగనా చెప్పుకొచ్చింది.
ఈమధ్య కాలంలో బాలీవుడ్‌లో వస్తున్న లవ్ స్టోరీ సినిమాలు భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనం తగ్గించే విధంగా ఉన్నాయి. వివాహ వ్యవస్థ గొప్పతనం తగ్గించే విధంగా ఈ మధ్య కాలంలో సినిమాలు చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని కంగనా తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటివి బాలీవుడ్‌లో పునరావృతం కావద్దంటూ ఫిల్మ్ మేకర్స్‌కి కంగనా మాస్ వార్నింగ్ ఇచ్చింది. సినిమాల పేరుతో ఉమ్మడి కుటుంబ వ్యవస్థను, వివాహ వ్యవస్థను నాశనం చేయడం, తక్కువ చేసి చూపించడం చేస్తే కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కంగనాకు పలువురు నెటిజన్స్ మద్దతుగా నిలుస్తున్నారు.