మరో రావిపూడి దిగాల్సిందే..
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ వచ్చి ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ వచ్చి ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఆ సినిమా అంచనాలకు మించి రాణించింది. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఆ చిత్రం.. టాలీవుడ్ లో రీజనల్ మూవీగా ఎన్నో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మార్చి 1వ తేదీన జీ తెలుగు ఛానెల్ లో టెలికాస్ట్ కాబోతోంది. ఆ తర్వాత జీ5 ఓటీటీలోకి రానుంది. ఒకే రోజు ఓటీటీలో, టీవీలో రిలీజ్ కానున్న ఫస్ట్ తెలుగు మూవీగా కొత్త రికార్డు క్రియేట్ చేయనుంది.
అయితే వెంకీ మామ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం మూవీని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రీమేక్ చేయనున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. హిందీలో కూడా దిల్ రాజుయే నిర్మించబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి కాదని తెలుస్తోంది. మంచి హిందీ డైరెక్టర్ ను లైన్ లో పెట్టాలని చూస్తున్నారు.
త్వరలోనే అన్ని పనులు కూడా మేకర్స్ మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ విషయంలో కొన్ని సవాళ్లు తప్పని సినీ పండితులు చెబుతున్నారు. ఎందుకంటే మన దగ్గర సినిమా విజయానికి వెంకటేష్ కామెడీ టైమింగ్, ఐశ్వర్య రాజేష్ గోదావరి యాస, బాలనటుడు రేవంత్ అట్రాక్షన్, భీమ్స్ హిట్ సౌండ్ ట్రాక్స్ కారణయ్యాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
వాటిన్నింటికంటే ముఖ్యంగా రీజినల్ నేటివిటీని పర్ఫెక్ట్ గా తెరపైకి తీసుకు వచ్చిన అనిల్ రావిపూడి. నటీనటులు ఎంత కష్టపడినా దాదాపు వారి నటన మొత్తం కూడా రావిపూడి టైమింగ్ మీద వెళ్లిందని చెప్పవచ్చు. అలాగే అతను ప్రమోషన్ విషయంలో చేసిన అల్లరిగా, తీసుకున్న జాగ్రత్తలు.. ఇదే సినిమాకు బ్రహ్మరథం పట్టేలా చేసిందని క్లియర్ గా అర్థమైంది.
అయితే ఇప్పుడు సినిమాను హిందీలో రీమేక్ చేయాలంటే.. మరో రావిపూడి దిగాల్సిందే. నటీనటులను పర్ఫెక్ట్ గా తెరపైకి తీసుకు రావడమే కాకుండా జనాలను ఎట్రాక్ట్ చేసే జిమ్మిక్కులు కూడా అవసరం. అలాగే బెస్ట్ రిలీజ్ స్లాట్. సంక్రాంతి ఫెస్టివల్ ఇక్కడ ఎంతగా కలిసొచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాబట్టి హిందీ సినిమాకి కూడా ఏదో ఒక పర్ఫెక్ట్ స్లాట్ అయితే దొరకాలి. అసలు కథ అలానే ఉన్నా మేకింగ్ విధానంలో అనేక మార్పులు అవసరం. నార్త్ ఇండియన్స్ టేస్ట్ కు తగ్గట్టు కచ్చితంగా మార్చాల్సిందే. దీంతో ఇప్పుడు మేకర్స్.. ఎలాంటి మార్పులు చేస్తారన్నది ఆసక్తికరం.
అయితే గతంలో పలువురు ఆ విషయంలో బాలీవుడ్ నిర్మాతలు ఫెయిల్ అయ్యారు. అలా వైకుంఠపురంలో రీమేక్ ఫ్లాప్ తర్వాత నుంచి చాలా మంది హిందీ నటులు మళ్ళీ రీమేక్ లు చేయడానికి కాస్త ఆలోచిస్తున్నారు. అప్పట్లో ఎఫ్ 2 కూడా రీమేక్ చేయడానికి దిల్ రాజు వెనకాడినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు సంక్రాంతి వస్తున్నాం రీమేక్ చేయడం అంత ఈజీ అయితే కాదు. అనిల్ రావిపూడి లాంటి బాలీవుడ్ మేకర్ పక్కా సెట్టవ్వాలి. మరి మేకర్స్ ఏం చేస్తారో.. ప్రాజెక్టును ఎలా డిజైన్ చేస్తారో వేచి చూడాలి.