అభిరుచి కలిగిన చిత్రాలను రూపొందించే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈమధ్య సినిమాకు సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు. 2017 లో బ్లాక్ బస్టర్ చిత్రం 'ఫిదా' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమ్ముల ప్రస్తుతం ఒక సినిమాపై వర్క్ చేస్తున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాకు గ్యాప్ వచ్చిందట. ఈ సినిమాలో డ్యాన్స్ కు ప్రాధాన్యత ఉందని... అందుకే ఈ గ్యాప్ లో హీరో హీరోయిన్లు డ్యాన్స్ నేర్చుకుంటున్నారని సమాచారం.
అయితే ఈ గ్యాప్ లో అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవిల క్రేజీ కాంబోను శేఖర్ కమ్ముల సెట్ చేశారని సమాచారం. 'మజిలీ' సూపర్ సక్సెస్ తో చైతు ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. చేతిలో కూడా మూడు నాలుగు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. మేనమామ వెంకటేష్ తో కలిసి నటిస్తున్న 'వెంకీమామ' ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. దీంతో పాటు 'బంగార్రాజు'.. మేర్లపాక గాంధి చిత్రం లైన్లో ఉన్నాయి. వీటితో పాటు దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమాకూడా లైన్లో ఉంది. మరి ఇన్ని సినిమాల మధ్యలో ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో వేచి చూడాలి.
ఏదేమైనా చైతు- సాయి పల్లవి కాంబినేషన్ కొత్తగా ఉంది. 'ఫిదా' తో అందరినీ మెప్పించిన సాయిపల్లవి మళ్ళీ శేఖర్ కమ్ములతో కలిసి పనిచేయడం కూడా ఈ ప్రాజెక్టును క్రేజీగా మారుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయని సమాచారం.