తమ సినిమా గురించి చెప్పడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టయిలు ఉంటుంది. అయితే శేఖర్ కమ్ముల వంటి కొందరు దర్శకులు మాత్రం.. తమ సినిమాను తామె ఎంత ప్రేమించిందీ ఎంతో హానెస్టుగా చెప్పేస్తుంటారు. ముఖ్యంగా వారి మాటలలో ధ్వనించే నిజాయితీ ఒక్కోసారి ప్రేక్షకులను ధియేటర్లకు పట్టుకొచ్చేస్తుంది కూడా. గత రాత్రి జరిగిన ''ఫిదా'' ఆడియో లాంచ్ ఈవెంట్లో దర్శకుడు శేఖర్ కమ్ముల తన సినిమా గురించి అలాగే మాట్లాడాడు.
''ఒకరకంగా చెప్పాలంటే.. ఫిదా సినిమా నా కూతురు లాంటిది. చాలా వైబ్రెంట్ గా బోల్డుగా చాలా రెబెల్లియస్ గా ఉంటుంది. 70 - 80 రోజులలో తీస్తానని చెప్పాను కాని.. ఒక 40 రోజులు అయ్యాక కొన్ని ఇష్యూలు వచ్చాయి. వరుణ్ కు కాలు ఫ్రాక్చర్ అవ్వడంతో కాస్త లేటైంది. ఆ తరువాత అమెరికాలో ఫాల్ కలర్స్ లో తీద్దాం అనుకుంటే అదే లేటైంది. ఆ తరువాత రాజు గారు వచ్చారు.. కాని వెంటనే ఆయనకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. అనితగారు చనిపోతారని అనుకోలేదు. అయినా సరే రాజు గారు వచ్చారు.. మేం చాలా కష్టపడి సినిమా తీశాం'' అంటూ మేకింగ్ గురించి చెప్పాడు కమ్ముల.
ఇక సినిమాలో ఉన్న ఎసెట్స్ గురించి మాట్లాడుతూ.. ''ఈ సినిమాకు తెలంగాణ యాస ఒక ఎసెట్ అయితే.. రాజు గారు ఇంకో ఎసెట్.. సాయి పల్లవి మరో పెద్ద ఎసెట్.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నటిస్తోంది. పల్లవి చాలా డిసిప్లైన్డ్ యాక్టర్. మాంచి డ్యాన్సర్. ఈ సినిమాలో ఇరగదీసింది. ఆ తరువాత వరుణ్ తేజ్ ఇంకో ఎసెట్.. సినిమా చాలా స్పెషల్ గా వచ్చింది. ఖుషీ తొలిప్రేమ వంటి సినిమాలు గుర్తొస్తాయి. వరుణ్ స్మయిల్ అండ్ స్టయిలింగ్ నాకు చాలా ఇష్టం '' అని తెలిపాడు. అంతేకాదు.. వరుణ్ మెగా పోలికల గురించి కూడా చెప్పాడు. ''కన్నీళ్లు పెట్టుకునే హీరో పాత్రలో నటించాడు వరుణ్. ఆయన యాక్టింగ్ లో అప్పుడప్పుడూ చిరంజీవి గారు కనిపిస్తారు. కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. కొన్నిసార్లు నాగబాబు కనిపిస్తాడు'' అంటూ పొగిడేశాడు.
ఇక దిల్ రాజు గురించి లాస్టులో ఒక ఛమక్ వేశాడు కమ్ముల. ''ఈ సినిమాను 1 ఇయర్ తీశాం. మాది వేరే స్కూల్. చాలా థ్యాంక్స్ అండీ దిల్ రాజుగారు చాలా పేషెంట్ గా మాతో పనిచేయనిచ్చారు. మా పని మేం చేశాం సార్. ఇప్పుడు మీ విశ్వరూపం మీరు చూపించాలి. ఈ సినిమా రిజల్ట్ నాకు ఆల్రెడీ తెలుసు. రియల్లీ గుడ్ స్పెషల్ ఫిలిం. యంగస్టర్స్ అందరికీ బాగా నచ్చేస్తుంది'' అంటూ తన సినిమాపై కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు.