నాగ చైతన్య - సాయి పల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా షూటింగ్ మొదలైన ఈ సినిమాను జస్ట్ మూడు నెలల్లో ఫినిష్ చేసేస్తాడట శేఖర్ కమ్ముల. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పాడు. మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాను కేవలం మూడు నెలల్లో తెరకెక్కించడం సాధ్యమేనా..? అనే డౌట్ ఇప్పుడు అందరిలో మొదలైంది.
పైగా శేఖర్ కమ్ముల సినిమా అంటే మ్యాగ్జిమం అవుట్ డోర్ షూట్లే ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమాను కొన్ని డిఫరెంట్ లోకేషన్స్ లో ప్లాన్ చేస్తున్నారు కూడా. కాకపోతే ఈ సినిమాకు సంబంధించి అన్నీ రెడీగా ఉన్నాయి. అందుకే ఆయన అంత దీమాగా ఉన్నారు. దీనికి రీజన్ ఇప్పటికే ఈ కథను కొత్తవాళ్ళతో సగం కంటే ఎక్కువ షూట్ చేయడమే. లోకేషన్స్ తో పాటు ఆర్టిస్టులు కూడా అవే రోల్స్ లో కనిపిస్తారు. సో నాగ చైతన్య -సాయి పల్లవి తప్ప మిగతా వాళ్ళంతా పాతే. అంటే ఇప్పుడు శేఖర్ కమ్ముల పని జస్ట్ పెనం మీద పాత అట్టు స్థానంలో కొత్త అట్టు వేయడం అంతే. అందుకే ఎక్కువ రోజులు తీసుకోకుండా చైతన్య సాయి పల్లవిలను సెట్ చేసుకున్నాడు.
ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి దిగుతున్న రామ్మోహనరావు - సునీల్ కి కూడా ఇది మంచి ప్రాఫీట్ సినిమా అవ్వబోతుందనే టాక్ ఉంది. ఇదే కథతో కొత్త వాళ్ళ మీద ఖర్చు పెట్టినప్పటికీ అది ఎంతో కాదని తకువే అయిందని అంటున్నారు. సో ఈ కాంబినేషన్ మీద మళ్ళీ కొంచెం ఖర్చు పెట్టి సినిమా క్రేజ్ మీద బిజినెస్ చేయబోతున్నారు. అసలే లవ్ స్టోరీకి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే కాంబో కావడంతో సినిమా రిలీజ్ కి ముందే కచ్చితంగా మంచి బిజినెస్సే జరుగుతుంది. అందులో సందేహమే లేదు.