కూతుళ్లతో బికినీలు వేయించరేం?

Update: 2017-09-18 05:44 GMT
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ బాగా స్ట్రెయిట్ ఫార్వార్డ్. ఓ పాయింట్ ను ప్రశ్నించడంలో.. నిలదీయడంలో.. నిలబెట్టి కడిగేయడంలో.. ఈమెకు సాటి రాగల మహిళ ఎవరూ దరిదాపుల్లో కనిపించరు. స్టార్స్.. వారి డాటర్స్ పై తాజాగా ఈ భామ చేసిన కొన్ని కామెంట్స్.. టాలీవుడ్ కి కూడా వర్తిస్తాయని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

"కొన్ని విషయాలు మగవాళ్ల కారణంగానే జరుగుతాయి. కానీ అవే పనులు మహిళలు చేసినపుడు మాత్రం వాళ్లపై పడి ఏడుస్తుంటారు. ఉదాహరణకు సెక్సువల్ లైఫ్ నే తీసుకోండి.. వారికి సెక్స్ అంటే ఫన్. అదే మహిళలను మాత్రం క్రిమినల్స్ గా చూస్తారు. గ్లామర్ ప్రపంచంలో కూడా ఇలాంటివే నడుస్తుంటాయి. చాలామంది పురుషులు.. కాసనోవా టైపులో ఉండే కొడుకులను బాగానే ప్రోత్సహిస్తారు. కానీ వారి కూతుళ్లు మాత్రం కనీసం బికీనీలు వేసుకోకూడదు. వారు.. వారి పుత్రరత్నాలు మాత్రం బికినీలు వేసుకున్న 15 ఏళ్ల అమ్మాయిలతో తిరగచ్చు. అమ్మాయిల దగ్గరకు వచ్చేసరికి సాంప్రదాయాలు గుర్తొస్తాయి" అంటూ ఘాటుగానే తగులుకుంది కంగనా.

బికినీలు వేయించడం అంటే.. సినిమాల్లో నటించేందుకు అంగీకరించడం అన్నదే కంగనా ఉద్దేశ్యం. అయితే.. తన కూతురు వంక చూస్తే చంపేస్తానని షారూక్ అనడం లాంటి సంఘటనలు.. కంగనా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం అయినా.. ఇలాంటి భావజాలం ఉన్న వ్యక్తులు బాలీవుడ్ కంటే టాలీవుడ్ లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు. స్టార్ స్టేటస్.. సామాజిక వర్గం.. అభిమానుల మనోభావాల పేరు చెప్పి.. ఎంతో మంది తమ కూతుళ్ల కలలను సర్వనాశనం చేసిన స్టార్ హీరోలు మన దగ్గర ఉన్నారు. అసలు తెలుగు సినిమాకు హీరోయిన్ల కొరత రావడానికి వీళ్లే కారణం అనే టాక్ కూడా ఉంది.
Tags:    

Similar News