సీనియర్ హీరోయిన్ సెక్స్ చాలా ముఖ్యమంటోంది

Update: 2017-03-26 07:18 GMT
బాలీవుడ్ ఈ మధ్య మరీ బోల్డయిపోయింది. ఇంతకుముందు లాగా ఎవ్వరూ ముడుచుకుని కూర్చోవట్లేదిక్కడ. పెళ్లయి పెద్ద పెద్ద పిల్లలు ఉన్న వాళ్లు సైతం సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడుతున్నారు. మొహమాటం లేకుండా తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు. హీరోయిన్ గా ఉన్నపుడు.. పెళ్లయ్యాక చాలా సైలెంటుగా ఉండిపోయిన ట్వింకిల్ ఖన్నా.. 40 ప్లస్ వయసులో సెక్స్ గురించి చాలా బోల్డ్ గా మాట్లాడుతోంది. సెక్స్ చాలా ముఖ్యమైన విషయమని.. అందరూ సెక్సువల్ లైఫ్ ను ఎంజాయ్ చేయాలని సెలవిస్తోంది. ఈ మధ్య తన బ్లాగులో సెన్సేషనల్  పోస్టులు పెడుతున్న ట్వింకిల్.. తాజాగా శృంగారం.. భర్త.. పిల్లలు.. ఇలా అనేక అంశాల్ని కలగలిపి ఒక పోస్ట్ రాసింది.

భర్త హ్యాండ్ బ్యాగ్ లాంటి వాడని.. అతడితో జీవితం చాలా సౌకర్యంగా ఉంటుందని ట్వింకిల్ వ్యాఖ్యానించింది. భర్త.. హ్యాండ్ బ్యాగ్.. ఈ రెండూ లేకపోయినా గడిపేయొచ్చని.. కానీ ఇవి ఉంటే జీవితం మరింత సౌకర్యంగా ఉంటుందని ఆమె పేర్కొంది. అక్షయ్ కుమార్ తో తనది సంతోషకరమైన వైవాహిక జీవితమని.. తమది విజయవంతమైన జోడీ అని పేర్కంది. తామిద్దరం కలిసి టెన్నిస్ డబుల్స్ మ్యాచ్ ఆడుతున్నంత సమన్వయంతో ఉంటామని కూడా ఆమె వ్యాఖ్యానించింది. వైవాహిక జీవితంలో సెక్స్ చాలా ముఖ్యమైన అంశమని.. మగాడు లేకపోయినా జీవితాన్ని సాగించేయవచ్చని కొంతమంది మహిళలు అనుకుంటారని.. కానీ అది కరెక్ట్ కాదని ఆమె అభిప్రాయపడింది. మాతృత్వం జీవితాన్ని మలుపు తిప్పే కొత్త అనుభవమని.. తల్లి కావడంతో ప్రేమకు మరో నిర్వచనమేంటో తెలుస్తుందని ఆమె సెలవిచ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News