డాన్ 3.. కింగ్ ఖాన్ చిట్ట‌చివ‌రి ఆశ‌

Update: 2019-01-27 16:31 GMT
ద‌శాబ్ధాల పాటు బాలీవుడ్ ని ఏక‌చ్ఛ‌త్రాధిప‌త్యంతో పాలించిన కింగ్ ఖాన్ షారూక్ ప్ర‌భ మ‌స‌క‌బారుతోందా? అంటే అవున‌నే ఇటీవ‌లి ప‌రాజ‌యాలు చెబుతున్నాయి. వ‌రుసగా ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌ని ప‌రాజ‌యాలు ట్రేడ్ లో ఖాన్ లెవ‌ల్ ని పూర్తిగా కిందికి దించేశాయి. దీంతో అత‌డు డైలెమాలో ప‌డిపోయాడు. గ‌త కొంత‌కాలంగా ఆశించిన బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌క్క‌క నానా హైరానా పడిపోతున్నాడు.

ఇప్ప‌టికే రెడ్ చిల్లీస్ యాక్టివిటీస్ పూర్తిగా త‌గ్గిపోయాయి. తీసిన సినిమాల‌న్నీ ఫ్లాపుల‌వ్వ‌డంతో ఏం చేయాలో పాలుపోని స‌న్నివేశం నెల‌కొంది. మ‌రోవైపు ర‌క‌ర‌కాల కోర్టు గొడ‌వ‌లు బాద్ షాని అల్ల‌రి పెడుతున్నాయి. ఈ స‌న్నివేశంలో అత‌డి దృష్టి సినిమాల కంటే.. పూర్తిగా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ వైపు మ‌ళ్లుతోంద‌ట‌. ఈ ఏడాది బాద్ షా సినిమాలేవీ చేయ‌డు. పూర్తిగా ఐపీఎల్ పైనే దృష్టి సారిస్తార‌ని తెలుస్తోంది.

అయితే కింగ్ ఖాన్ కి ఉన్న ఒకే ఒక్క ఆశ `డాన్` సిరీస్ లో కొత్త సినిమాని ప్రారంభించ‌డం. అందుకోసం ఫ‌ర్హాన్ అక్త‌ర్ ఇప్ప‌టికే స్క్రిప్టును రెడీ చేసే ప‌నిలో ఉన్నాడు. మలేషియాలో సినిమాని ప్రారంభిస్తార‌ట‌. ఏడాది చివ‌రినాటికి స్క్రిప్టు పూర్తిగా రెడీ అయితే ప‌ట్టాలెక్కిప్తార‌ని తెలుస్తోంది. అయితే ఈ గ్యాప్ లో ఫ‌ర్హాన్ `తుఫాన్` అనే వేరొక ప్రాజెక్టుతో బిజీగా ఉంటాడు. ప్ర‌ఖ్యాత మిడ్ డే క‌థ‌నం ప్ర‌కారం.. ఈ ఏడాది తుఫాన్ చిత్రంతో బిజీగా ఉంటాన‌ని ఫ‌ర్హాన్ తెలిపారట‌. డాన్ సిరీస్ లో మూడో సినిమాకి సీరియ‌స్ గానే స‌న్నాహాలు సాగుతున్నాయి. రితేష్ సిద్వానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. క‌నీసం ఈ సినిమాతో అయినా కోల్పోయిన మార్కెట్ ని తిరిగి తెస్తాడేమో చూడాలి. ఒకే ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డితే తిరిగి ఖాన్ లో ఉత్సాహం నిండుతుంది.
Tags:    

Similar News