కమెడియన్ నుంచి హీరోగా యూ టర్న్ తీసుకున్న వారిలో షకలక శంకర్ కూడా చేరిపోయాడు. సైలెంట్ గా సెట్ చేసుకున్న కథను చాలా ఫాస్ట్ గా పట్టాలెక్కించడానికి రెడీ అయ్యాడు. గత కొంత కాలంగా అనేక రూమర్లు వచ్చినప్పటికీ నిజం కాదని అందరు అనుకున్నారు. కానీ రీసెంట్ గా శంకర్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేయడంతో నిజమని నమ్మక తప్పలేదు. చిత్ర యూనిట్ తో కలిసి శంకర్ హీరోగా చేస్తోన్న తన ఫస్ట్ సినిమా టైటిల్ లుక్ ని రిలీజ్ చేశాడు.
శంభో శంకర అనే ఆ సినిమాకు శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో కొంచెం వైరల్ గా మారింది. శంకర్ సడన్ ఎంట్రీ ఇచ్చినా చాలా స్టైలిష్ గా ఉన్నాడని ఎవరికీ తోచినట్టుగా వారు చాలా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు శ్రీధర్ మాట్లాడుతూ.. ఇంత మంచి అవకాశం ఇచ్చిన హీరో కి నిర్మాతలకు చాలా కృతజ్ఞతలని తెలిపాడు. శంకర్ మాట్లాడుతూ.. నా ఇన్నేళ్ల కెరీర్ లో హీరోగా చేయడానికి అవకాశాలు చాలా వచ్చాయి. కానీ నేను వాటిని ఒప్పుకోలేదు. ఫైనల్ గా శ్రీధర్ చెప్పిన కథ బాగా నచ్చడంతో కథ నచ్చి వెంటనే ఒప్పుకున్నట్లు తెలిపాడు. శంకర్ క్యారెక్టర్ ఇందులో ఫుల్ మాస్ లో ఉంటుందట. ఇక సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించనున్నాడు.
అంతా బాగానే ఉంది కాని.. సినిమా పోస్టర్ చూస్తే ఇదేదో యాక్షన్ సినిమా అన్నట్లుంది. కాని కామెడీ హీరోలు అటువంటి యాక్షన్ సినిమాలను చేస్తే జనాలేమో సింపుల్ గా రిజక్ట్ చేస్తున్నారు. సునీల్ అన్నయ్య.. సప్తగిరి తమ్ముడు అందుకు పెద్ద సాక్ష్యం. మరి తన కామెడీ కుటుంభీకుల పొరపాట్లు శంకర్ కు ఏమన్నా లెసెన్స్ నేర్పుంటే.. సినిమా బాగానే వచ్చుంటుందని అనుకోవాలి. లేదంటే సినిమా నిండి యాక్షన్ సెగలు ఉంటే మాత్రం.. బ్యాలెన్స్ వెండితెరపై చూద్దాం.. రిజల్ట్ బాక్సాఫీస్ దగ్గర చూద్దాం.