RC15 తో సంబంధం లేకుండా ఇండియన్‌ 2..!

Update: 2022-07-24 05:51 GMT
కమల్‌ హాసన్‌ మధ్యవర్తిత్వమో లేదా లైకా వారితో కుదిరిన రాజీ వల్లనో కాని ప్రముఖ దర్శకుడు శంకర్ తాను మధ్యలో వదిలేసిన ఇండియన్ 2 సినిమా ను పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇండియన్ 2 ను పూర్తి చేస్తామని ఇటీవలే విక్రమ్‌ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమంలో కమల్‌ హాసన్ స్వయంగా ప్రకటించాడు.

లైకా ప్రొడక్షన్స్ ఇండియన్ 2 యొక్క షూటింగ్ కోసం ఇప్పటికే సిద్ధం అయ్యిందని తెలుస్తోంది. మొన్నటి వరకు రామ్‌ చరణ్‌ తో శంకర్ చేస్తున్న సినిమా షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత ఇండియన్ 2 ప్రారంభం అవుతుందని భావించారు. కమల్‌ హాసన్ కూడా ఇండియన్ 2 సినిమా కు రామ్‌ చరణ్ సినిమా అడ్డుగా ఉంది అన్నట్లుగా కామెంట్స్ చేశాడు.

ఆయన కామెంట్స్ తో ఇండియన్ 2 సినిమా ఖచ్చితంగా ఆర్ సీ 15 పూర్తి అయిన తర్వాత మాత్రమే మొదలు అవుతుందని అనుకున్నారు. కానీ తాజాగా తమిళ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్ 2 షూటింగ్ అతి త్వరలోనే పునః ప్రారంభం అవ్వబోతుంది. రామ్‌ చరణ్ మూవీ తో సంబంధం లేకుండా ఆ సినిమా షూటింగ్‌ పూర్తి కాకుండానే శంకర్ ఇండియన్ 2 పనులు మొదలు పెట్టనున్నాడు అంటున్నారు.

ఆర్ సీ 15 సినిమా షూటింగ్‌ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో శంకర్‌ శరవేగంగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సమయం లోనే శంకర్ ఇండియన్ 2 ను కూడా పట్టా లెక్కించడం ద్వారా రెండు సినిమా లను సమాంతరంగా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్‌ చరణ్ మరియు శంకర్ సినిమా తో పాటు ఇండియన్ 2 కూడా ఒకే సమయంలో షూటింగ్‌ ను ముగించుకుని కొద్ది గ్యాప్‌ లోనే వస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News