శంకర్ ఏం చేసినా అంతే. నభూతో అన్న రేంజిలో ఉండాలనుకుంటాడు. అందుకే ఇండియన్ సినిమాలో ఇంకెవరూ తాకని శిఖరాల్ని తాకాడు. ‘రోబో’ సినిమా చూసి బాలీవుడ్ జనాలు నోళ్లు వెళ్లబెట్టారు అప్పట్లో. మామూలుగా శంకర్ తనకు తానే సవాల్ విసురుకుంటుంటాడు. కొత్త టెక్నాలజీ వాడటంలో.. కంప్యూటర్ గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్.. సమర్థంగా వినియోగించుకోవడంలో ఎవరైనా అతడి తర్వాతే ఉంటారు. కానీ ఇప్పుడు రాజమౌళి అని ఒకడొచ్చి ‘బాహుబలి’ సినిమాతో శంకర్ కే సవాలు విసిరాడు. అందుకే ఇప్పుడు శంకర్ తనకు తాను మరింత హై స్టాండర్డ్స్ సెట్ చేసుకుని రోబో-2తో రంగంలోకి దిగుతున్నాడు.
ఇవాళే లాంచ్ అయిన రోబో-2కు రూ.300 కోట్ల బడ్జెట్ పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. ఐతే శంకర్ ఊరికే కోట్లు ఖర్చు పెట్టించేయడు. ప్రతి రూపాయీ తెరమీద కనిపిస్తుంది. సినిమాలో అంత భారీతనం ఉంటుంది. ‘రోబో’తో హాలీవుడ్ స్థాయికి దగ్గరగా వెళ్లిన శంకర్.. ఇప్పుడిక ‘రోబో-2’తో వాళ్ల స్థాయికి ఏమాత్రం తగ్గని రీతిలో ఔట్ పుట్ ఇవ్వాలనుకుంటున్నాడు. సినిమా కోసం ఖర్చు పెట్టబోయే ప్రతి రూపాయి విషయంలో శంకర్ కు క్లారిటీ ఉందట. సగం బడ్జెట్ కేవలం సాంకేతిక హంగులకే వినియోగించబోతున్నాడట. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా 10 వాహనాలు తయారు చేయిస్తున్నాడట శంకర్. ఒక్కో వాహనానికి కోటి రూపాయల దాకా ఖర్చువుతోందట. ఆటోమొబైల్ నిపుణులతో ప్రత్యేకంగా ఈ వాహనాల్ని తయారు చేయిస్తున్నాడట. ఇవి సినిమాలో ప్రత్యేక ఆకర్షణ అవుతాయని చెబుతున్నారు. ఇలాంటి హంగులు సినిమాలో చాలానే ఉండబోతున్నాయట. ఇంకా మొదలవకముందే ఇలాంటి వార్తలతో విపరీతమైన ఆసక్తి రేపుతున్న ‘రోబో-2’కు విడుదలయ్యే సమయానికి ఎలాంటి హైప్ వస్తుందో ఏమో!