రోబో-2లో విలన్ గా నటింపజేయడానికి డైరెక్టర్ శంకర్ కు ఇక్కడి వాళ్లెవరూ ఆనలేదా? వంద కోట్లిచ్చి మరీ ఆర్నాల్డ్ ను పట్టుకు రావాలా? పది కోట్లిస్తే ఇక్కడ బ్రహ్మాండమైన నటులు దొరుకుతారు కదా? ఒక్క నటుడికే వంద కోట్లిచ్చేస్తే ఇక సినిమాకు ఏం పెట్టిస్తాడు?.. రోబో-2కు ఆర్నాల్డ్ ఓకే అయ్యాడన్న వార్త బయటికి వచ్చినప్పటి నుంచి ఇలాంటి కామెంట్లు చాలానే వినిపిస్తున్నాయి. కానీ శంకర్ అంత తెలివి తక్కువవాడా.. అతనేమీ ఆలోచించకుండానే ఆర్నాల్డ్ ను ఇక్కడి తీసుకొస్తాడా.. అన్నది ఆలోచించాలి. మనకు వంద కోట్లు పెద్ద మేటర్ కానీ.. ఆర్నాల్డ్ విషయంలో అది చిన్న అమౌంట్. ఆ రెమ్యూనరేషన్ కి అతను ఒప్పుకుని ఓ ఇండియన్ రీజనల్ మూవీ చేయడానికి అంగీకరించినందుకు మనం ఆశ్చర్యపోవాలి.
నిజానికి ఆర్నాల్డ్ కు ఇచ్చేది వంద కోట్లే కానీ.. అతను రోబో-2లో నటించడం వల్ల వందల కోట్లలోనే ప్రయోజనం జరుగుతుంది ‘రోబో-2’కి. ఆర్నాల్డ్ అడుగుపెట్టగానే అది ఆటోమేటిగ్గా ఇంటర్నేషనల్ మూవీ అవుతుంది. ఆర్నాల్డ్ ముఖం చూపించి.. ఎన్నో పెద్ద దేశాల్లో భారీగా రోబో-2 సినిమాను విడుదల చేయడానికి అవకాశం లభిస్తుంది. నేరుగా అమెరికాలో హాలీవుడ్ సినిమాలకు పోటీగా రోబో-2ను వదలొచ్చు. మిగతా పెద్ద దేశాల్లోనూ భారీగా విడుదల చేసుకోవచ్చు. కంటెంట్ బాగుంటే.. రోబో-2 అసాధారణమైన వసూళ్లు సాధించేందుకు అవకాశముంటుంది. వెయ్యి కోట్ల మార్కును అందుకున్నా ఆశ్చర్యమేమీ లేదు. శంకర్ మంచి దర్శకుడే కాదు.. తన సినిమాను మార్కెట్ చేసుకోవడంలోనూ మేధావి. సినిమాలు బాగా తీయడమే కాదు.. వాటికి మంచి క్రేజ్ తీసుకొచ్చి మార్కెట్ చేసుకుని.. స్థాయి పెంచడంలోనూ శంకర్ దిట్ట. అందుకే ఇప్పుడతను ఈ స్థాయిలో ఉన్నాడు. రోబో-2 విషయంలోనూ అతను మరోసారి తన మార్కెటింగ్ ప్రతిభను బయటికకి తెచ్చాడు. దాని ఫలితం ఎలా ఉంటుందో రోబో-2 విడుదలైనపుడు తెలుస్తుంది.