శ‌ర్మా గాళ్ సూప‌ర్ హాట్ థై షో!

Update: 2023-01-02 15:30 GMT
వేడెక్కించే వడ్డనలతో నియాశర్మ చెలరేగే తీరు నిరంతరం యూత్ లో హాట్ టాపిక్. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో ఇన్ స్టాలో రేపే చిచ్చు అంతే ఆసక్తికరం.  సొగ‌స‌రి బికినీ.. స్విమ్ సూట్ సెలబ్రేషన్ కి వీర లెవల్లో ఫాలోయింగ్ ఉంది. సాధారణంగా బాలీవుడ్ బ్యూటీలంతా  మాల్దీవులు వేదికగా మంటలు పుట్టిస్తుంటారు. కానీ ఈబ్యూటీ  మాత్రం అంతదూరం వెళ్లాల్సిన పనిలేదని ఎన్నోసార్లు నిరూపించింది.

బీచ్  ఎక్క‌డ కనిపించినా అక్క‌డ తుఫాన్ హెచ్చ‌రికులు జారీ చేసేస్తుంది. నేను ఉన్నంత సేపు ఇటువైపు గారావొద్దు...వ‌స్తే చూసి త‌ట్టుకునే శ‌క్తి ఉండాలంటూ చెప్ప‌క‌నే చెబుతుంది.  గోవా వెళ్తే చాలు..ఆస్వాదనలో మాల్దీవుల  బ్యూటీల్ని మించిపోతుంది. తాజాగా బ్యూటీ డిజైన్డ్ దుస్తుల్లో క్యామ్ కి ఇచ్చిన ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిగో  ఇక్క‌డిలో పింక్ క‌ల‌ర్ దుస్తుల్లో బోట్ పై విహారం చేస్తూ చిక్కింది.

థై అందాలు ఆర‌బోస్తూ క్యామ్ కి ఇచ్చిన ఫోజులు సెగ‌లు పుట్టిస్తున్నాయి. నియాశ‌ర్మ ఫోజుల్లో ఓ ఇండికేష‌న్ కామ‌న్ గా క‌నిపిస్తుంది. సిట్టింగ్ పోజీష‌న్ లో ఎప్పుడు  పోజులిచ్చినా..ఒక ఫోజు మాత్రం కాలు మీద కాలేసుకుని కాక‌లు రేప‌డం ఖాయం. బ్యూటీ ఫోటో సెష‌న్ లో ఆ ర‌క‌మైన ఫోటోలే ఎక్కువ‌గా ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి.

ఇక నియా కెరీర్ సంగతి చూస్తే! ఈ ఫాలోయింగ్ అంతా ఇన్ స్టాకే పరిమితం. నటిగా మాత్రం అమ్మడు ఇప్పటికీ బిజీ కాలేదు. హిందీలో రకరకాల షోలు చేయడం మినహా వెండి తెరపై అబ్బురు పరించింది లేదు. అయితే నియాకి ఇక్కడ టైమ్ కూడా సహకరిచడం లేదు. శక్తి వంచన  లేకుండా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నా?. ఫలించడం లేదు.

ట్యాలెంట్ ని ప్రూవ్ చేసుకునే సరైన ఛాన్స్ దక్కడం లేదు. ఇంకా మ్యూజిక్ వీడియోస్ తో నే మెప్పిస్తుంది. వెబ్ సిరీస్ లాంటివి అందుబాటులోకి వచ్చి రెండు..మూడు అవకాశాలు  అందుకున్నా ఇంకా క్లిక్ అవ్వలేదు. వయసు కూడా మీద పడుతుంది. ఇప్పటికే  32 ఏజ్ కూడా  క్రాస్ చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News