అమెరికాలో 1000 కోట్ల‌తో కింగ్ ఖాన్ భారీ క్రికెట్ స్టేడియం

Update: 2022-05-01 13:30 GMT
కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని అంత‌కంత‌కు విస్త‌రించే ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నారు. ఇప్పుడు ఏకంగా USAలోని లాస్ ఏంజెల్స్ లో అత్యంత భారీ స్టేడియంని నిర్మించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. KKR సహ-యజమాని షారూఖ్ ఖాన్ క్రికెట్ స్టేడియంను నిర్మించబోతున్నట్లు స్వ‌యంగా వెల్లడించారు.

శుక్రవారం జరిగిన ఓ స‌మావేశంలో కోల్ కతా నైట్ రైడర్స్ మేజర్ లీగ్ క్రికెట్ (MLC) భాగస్వామ్యంతో అత్యాధునిక క్రికెట్ స్టేడియంను నిర్మించనున్నట్లు ప్రకటించారు. రెండుసార్లు IPL చాంపియ‌న్ లు గా కేకేఆర్ నిలిచింది. తాజా ప్ర‌క‌ట‌న అనంత‌రం పూర్తి వివ‌రాల్ని సేక‌రించ‌గా.. దీనికోసం భారీ బ‌డ్జెట్ ని షారూక్ వెచ్చించ‌నున్నార‌ని తెలిసింది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఆర్కిటెక్ట్ లు HKS ఒక అరేనాను డిజైన్ చేయ‌నుంది. ప్రఖ్యాత నగరం గ్రేటర్ లాస్ ఏంజిల్స్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో బహుళ-మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ స్టేడియంని నిర్మిస్తారు.

ఫ్రాంచైజీ సహ-యజమాని షారూక్ నుండి వెలువ‌డిన‌ ప్రకటన ప్రకారం.. షారుఖ్ ఖాన్ - కరేబియన్ ప్రీమియర్ లీగ్ జట్టు ట్రిన్ బాగో నైట్ రైడర్స్ లో కూడా వాటాను కలిగి ఉన్నాడు. ఇందుకు సంబంధించిన డెవ‌ల‌ప్ మెంట్ పైనా ఆయ‌న‌ ధృవీకరించారు. ఈ టై అప్ విష‌య‌మై  ఆశాజనకంగా ఉన్నామ‌ని తెలిపారు.

అమెరికా MLC లో మా పెట్టుబడి USAలో క్రికెట్ కి ఉత్తేజకరమైన ఊత‌మ‌స్తుంద‌ని భావిస్తున్నాం. భవిష్యత్తుపైనే నమ్మకంగా ఉన్నాం. T20 క్రికెట్ లో నైట్ రైడర్స్ ను గ్లోబల్ బ్రాండ్ గా స్థాపించాలనే మా వ్యూహానికి అనుగుణమైన ప్ర‌ణాళిక ఇది అని SRK వెల్ల‌డించారు. గ్రేటర్ లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మించాలనే ప్రణాళిక మాకు మా MLCకి ఉత్తేజాన్నిచ్చింది.  ఇది ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ప్రభావాన్ని చూపుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.. అని ఖాన్ వ్యాఖ్యానించారు.

2024 పురుషుల T20 ప్రపంచ కప్ ను యునైటెడ్ స్టేట్స్ .. వెస్టిండీస్ లో కోహోస్టింగ్ చేయబోతున్నందున అట్లాంటిక్ మహాసముద్రం అంతటా జెంటిల్ మన్ గేమ్ కు భారీ వృద్ధి ఉంది. SRK .. KKR బ్రాండ్ లాస్ ఏంజిల్స్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) గుర్తింపు పొందిన పిచ్ తో ముందుకు రావాలనే ప్రణాళిక ఉంది. గొప్ప టెక్నాల‌జీని స‌మ‌ర్థంగా ఉపయోగించుకోవాలని అన్నారు.

ప్రపంచ క్రికెట్ లో అత్యున్నత స్థాయి మ్యాచ్ లను నిర్వహించే వేదికను నిర్మిస్తామ‌న్నారు. KKR ప్రణాళికలలో అత్యాధునిక శిక్షణా సౌకర్యాలుంటాయి. లాకర్ గదులు- లగ్జరీ సూట్లు- ప్రత్యేక పార్కింగ్- రాయితీలు- ఫీల్డ్ లైటింగ్ స‌హా ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అథ్లెటిక్స్ లో అద‌ర‌గొట్టే అమెరికాలో క్రికెట్ కి ఆద‌ర‌ణ అంతంత మాత్ర‌మే. కానీ గ్లోబ‌ల్ ట్రెండ్ మారుతోంది. మారుతున్న ట్రెండ్ కి అనుగుణంగా అమెరిక‌న్లు క్రికెట్ ని ఆరాధిస్తున్నారని ఖాన్ గ్ర‌హించారు. అందుకే ఇప్పుడు అమెరికాలో క్రికెట్ వృద్ధికి కింగ్ ఖాన్ స్కెచ్ వేసారు. దాంతో పాటే భారీగా ఆర్జించే ల‌క్ష్యాల‌ను నిర్ధేశించార‌న్న‌మాట‌.
Tags:    

Similar News