ముందు గుర్తింపు లేని చిన్న చిన్న పాత్రలు చేసి.. ఆ తర్వాత విలన్- క్యారెక్టర్ రోల్స్ చేసి.. ఆపై ఇద్దరు ముగ్గురు హీరోలున్న సినిమాల్లో నటించి.. చివరగా సోలో హీరోగా స్థిరపడ్డ నటుడు శర్వానంద్. ఈ తరం యువ హీరోల్లో ఎవ్వరూ పడనంత స్ట్రగుల్ పడ్డాడు శర్వానంద్. ఐతే ఇప్పుడు అంత కష్టపడి రావడంలోనే కిక్కుందని అంటున్నాడు శర్వా. మూడు వరుస హిట్లతో ఊపుమీదున్న శర్వా.. ప్రస్తుతం చంద్రమోహన్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు.
ఇన్నేళ్ల కెరీర్లో చాలా కష్టాలు పడ్డానని.. ఐతే అవేవీ తనను బాధపెట్టలేదని.. ఐతే తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ‘కో అంటే కోటి’ సినిమా సమయంలో మాత్రం చేదు అనుభవాలు ఎదురయ్యాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు శర్వా. ‘‘కో అంటే కోటి ఆడనందుకు.. డబ్బులు పోయినందుకు బాధ లేదు. కానీ డబ్బు మనుషుల్ని ఏ సమయంలో ఎలా ప్రభావితం చేస్తుందో మాత్రం ఆ సినిమా తీసిన టైంలోనే నాకు అర్థమైంది. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు చెప్పలేను. కానీ డబ్బుకు.. మనిషికి ఉండే సంబంధం ఏంటో నాకు అప్పుడు జ్నానోదయం అయింది. అది బాధ కలిగించింది. నా కెరీర్లో అదొక్కటే చేదు అనుభవం’’ అని శర్వా చెప్పాడు.
ఇక కెరీర్ ఆరంభంలో చిన్నా చితకా పాత్రలు వేస్తున్నపుడు అసంతృప్తిగా అనిపించలేదా అని శర్వాను అడిగితే.. ‘‘ఒక సినిమాలో చిన్న క్యారెక్టర్ దొరికినా పెద్ద గిఫ్ట్‌లాగే అనిపించేది. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో నాది చిన్న పాత్రే. కానీ చిరంజీవిగారి పక్కన నటించే అవకాశం వచ్చిందని సంతోషించేవాణ్ని. ‘సంక్రాంతి’ - ‘లక్ష్మి’ సినిమాల్లోనూ చిన్న పాత్రలే. కానీ వెంకటేష్ గారి పక్కన కనిపిస్తున్నందుకు సంతోషం. ‘వెన్నెల’లో నేను చరేసిన నెగెటివ్ క్యారెక్టర్ కు తొలిసారి మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఆ తర్వాత అమ్మచెప్పింది నాకు మరింత మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా వచ్చినపుడు చిరంజీవిగారు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. వెంకటే్‌ష్ గారు నా సినిమాలు చూసి చాలాసార్లు అభినందించారు’’ అని శర్వా అన్నాడు.