శర్వానంద్ కి హిట్టు పడినా ఉలక్కుండా పలక్కుండా కామ్ గా ఉన్నాడేంటి అని అంతా సందేహం వ్యక్తం చేశారు. కానీ ఆయన పెద్ద స్కెచ్చే వేశాడు. చేయబోయేది తన పాతికో చిత్రం కాబట్టి అది స్పెషల్ గా ఉండాలన్న ప్రయత్నమో, లేక హిట్టు మీద హిట్టు కొడుతున్నాను కాబట్టి ఆ పరంపరని అలాగే కంటిన్యూ చేయాలన్న ప్రయత్నమో తెలియదు కానీ... కొత్త ప్రాజెక్టు విషయంలో అదిరిపోయే డెసిషన్ తీసుకున్నాడు. ఈసారి ఆయన అగ్ర దర్శకుడు సుకుమార్ రాసిన కథలో నటించబోతున్నాడు. మేలో ఆ చిత్రం మొదలు కాబోతోంది. మరి దర్శకుడు ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఆ సినిమాని నిర్మించబోతున్నాడు. సుకుమార్ లాంటి దర్శకుడు రాసిన కథ అంటే ఆ సినిమాకి అన్ని రకాలుగా హైప్ వస్తుంది. పైగా చిన్న హీరోల సినిమాల విషయంలో సుకుమార్ ఎప్పుడూ ఫెయిలవ్వలేదు. సో.. శర్వానంద్ లక్కు తోక తొక్కేశాడన్నమాట.
సంక్రాంతికి ఎక్స్ ప్రెస్ రాజా సినిమాతో వచ్చి అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు శర్వానంద్. అంతకుముందు కూడా ఆయనకి వరుసగా హిట్లు పడ్డాయి. దీంతో శర్వానంద్ మరి పొజిషన్ లోకి వెళ్లినట్టైంది. ఆయన కోసం పలువురు దర్శకులు కథలు సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నారు. కానీ శర్వానందే కొత్త సినిమా విషయంలో ఆచితూచి డెసిషన్ తీసుకున్నాడు. అలా ఆచితూచి అడుగేయడంతో శర్వాకి సుకుమార్ కథ దొరికిందన్నమాట. కీలకమైన పాతికో సినిమాకి తగ్గట్టుగానే శర్వా ఏర్పాట్లు చేసుకున్నాడు కాబట్టి ఆసినిమాకి అన్ని విధాలుగా హైప్ ఏర్పడబోతోంది. ఆ సినిమా కూడా హిట్టయితే ఇక శర్వానంద్ స్టార్ లీగ్ లోకి వెళ్లినట్టే లెక్క!