నైజాంలో శతమానం.. వామ్మో

Update: 2017-01-30 09:40 GMT
నైజాం ఏరియాలో పది కోట్ల షేర్ సాధించడం స్టార్ హీరోల సినమాలకు మాత్రమే సాధ్యం. స్టార్లలో కూడా కొంచెం తక్కువ స్థాయి ఉన్న వాళ్లకు ఇక్కడ రూ.10 కోట్ల షేర్ మార్కు అంటే కష్టసాధ్యమైన విషయమే. అలాంటిది శర్వానంద్ లాంటి స్టార్ ఇమేజ్ లేని హీరో నటించిన ‘శతమానం భవతి’ సినిమా నైజాంలో రూ.10 కోట్ల షేర్ తో సంచలనం సృష్టించే దిశగా అడుగులేస్తోంది. ఇప్పటిదాకా నైజాంలో ఈ సినిమా రూ.9.7 కోట్ల షేర్ సాధించడం విశేషం. త్వరలోనే రూ.10 కోట్ల మార్కును అందుకోవడం ఖాయం. ఇది నిజంగా మామూలు సెన్సేషన్ కాదు. ఖైదీ నెంబర్ 150.. గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి భారీ చిత్రాల పోటీ మధ్య రిలీజై ఈ స్థాయిలో వసూళ్లు సాధించడమంటే మాటలు కాదు.

అన్నిటికంటే పెద్ద విశేషం ఏంటంటే.. బాలయ్య సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ నైజాంలో 15వ రోజుకు రూ.9.05 కోట్ల షేరే రాబట్టింది. ఈపాటికి రూ.10 కోట్ల మార్కును అందుకుంటే అందుకుని ఉండొచ్చేమో కానీ.. ‘శతమానం భవతి’ లాంటి చిన్న సినిమాకు కూడా అదే స్థాయిలో వసూళ్లు రావడం మామూలు విషయం కాదు. రూ.20 కోట్ల షేర్ గ్యారెంటీ అనుకున్న ‘ఖైదీ నెంబర్ 150’ అక్కడ ఇప్పటిదాకా రూ.18.5 కోట్లే వసూలు చేసింది. కానీ శతమానం భవతి ఆ రెండు భారీ సినిమాలకు దీటుగా వసూళ్లు రాబట్టింది. ఆరంభంలో ఆ పెద్ద సినిమాలే జోరు చూపించినా.. తర్వాత తర్వాత థియేటర్లు పెంచుకుని.. వసూళ్లనూ పెంచుకుంది శర్వా సినిమా. ఓవరాల్ గా ఆల్రెడీ రూ.25 కోట్ల షేర్ మార్కును దాటేసిన ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.30 కోట్ల మార్కుకు దగ్గరగా వెళ్లినా ఆశ్చర్యం లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News