ఫోటో స్టొరీ: అబ్రకదబ్ర.. బికినీ మ్యాజిక్!

Update: 2019-05-13 14:30 GMT
షిబాని దండేకర్ గురించి తెలుసు కదా?  ఈమె గురించి చెప్పాలంటే ముందుగా ఆయన గురించి చెప్పుకోవాలి. బాలీవుడ్ లో మల్టి టాలెంటెడ్ ఫర్హాన్ అఖ్తర్ కు ప్రెజెంట్ గర్ల్ ఫెండ్ షిబాని.  ఫస్ట్ వైఫ్ అధున అఖ్తర్ కు విడాకులు ఇచ్చిన తర్వాత ఫర్హాన్ ఈ బ్యూటీతోనే అచ్చికబుచ్చికలాడుతున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.  ఇక ఫర్హాన్ - షిబాని జంట కూడా పబ్లిక్ గానే ఒకరిపై మరొకరికి ఉన్న తమ అభిమానాన్ని చాటుకుంటూ త్వరలోనే పెళ్ళి.. అనే పరోక్ష సందేశాన్ని ఇస్తోంది.  

అలా అని షిబాని జస్ట్ ఫర్హాన్ గర్ల్ ఫ్రెండ్ అని.. ఇంకేం స్పెషాలిటీ లేదని ఫిక్స్ అయిపోకండి.   షిబాని మోడల్ కమ్ టీవీ హోస్ట్. AXN ఛానల్ లో ప్రసారమైన 'మెన్ 2.0' దగ్గరనుండి మొదలు పెడితే  చాలా హిందీ ప్రోగ్రాములకు కూడా హోస్ట్ గా పనిచేసింది.  IPL కూడా ఈ సుందరి హోస్ట్.  సోషల్ మీడియాలో ఒక్క ఫోటోతో కార్చిచ్చు పెట్టగల దిట్ట.  ఆప్పుడప్పుడూ ఈ భామ పోస్ట్ చేసే ఫోటోలను చూస్తే గానీ అసలు మనకు సౌందర్యం అంటే ఏంటో తెలీదు.  తాజాగా ఈ సుందరి తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక బికినీ ఫోటోను పోస్ట్ చేసింది.

ప్రింటెడ్ కలర్స్ ఉండే బికిని ధరించి ఒక కొబ్బరి చెట్టు కు తన చేతిని ఆన్చి స్టైలిష్ గా నిలబడింది.  బికినీ డిజైన్ లోనే ఉన్న ఒక పొడవాటి షర్ట్ లాంటి దాన్ని వేసుకుంది కానీ దాన్ని తన అందాల విందుకు అడ్డం రాకుండా పక్కన.. వెనకాల పెట్టింది.  ఈ అందాలను సాధారణ పదాలతో వర్ణించడం కష్టం. కిలికి లాగా కులుకు బాష లాంటిది ఏదైనా కనిపెట్టాలి.  ఎక్కడో బీచ్ లొకేషన్ లో ఈ ఫోటో తీసుకుందట.  తీసిన వారు ఎవరో తెలుసా? ఇంకెవరు..  మన అఖ్తర్ సాబ్. అసలే అయన బాలీవుడ్ ఫిలిం మేకర్.. అయనకు తెలియని 'కలాపోసనా'.. కెమెరా యాంగిల్సా? ఇక నెటిజనులు వెర్రెత్తిపోయి మరీ కామెంట్లు పెట్టారు.  "తల నుంచి చిటికెన వేలు దాకా షిబాని సెక్సీ" అన్నాడు ఒక కళా పిపాసి.  మరో సౌందర్య ఆరాధకుడు.. "ఆప్ హాట్ హో.. ఆప్ సే బెహెతర్ కోయి నహీ" అన్నాడు.  మరో నెటిజన్.. "ఫర్హాన్ సూపర్ డూపర్ లక్కీ" అన్నాడు.
Tags:    

Similar News