# గోల్డ్ స్కీమ్: శిల్పా శెట్టి .. రాజ్ కుంద్రా దంపతులపై చీటింగ్ కేసు!
బాలీవుడ్ క్రేజీ నటి శిల్పాశెట్టి ఆమె భర్త.. బిజినెస్ మెన్ రాజ్ కుంద్రాపై చీటింగ్ కేసు నమోదైంది. బంగారం కొనుగోలు స్కీమ్ లో పెట్టుబడులు పెట్టిన ఓ వ్యక్తిని మోసం చేశారని నటి శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రాపై చీటింగ్ కేసు నమోదవ్వడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై శిల్పా శెట్టి ఘాటుగా స్పందించింది. ``నిజం త్వరలోనే భయటపడుతుంద``ని ఈ సందర్భంగా శిల్పా తెలిపింది.
ఎన్నారై సచిన్ జోషీ తనని శిల్పా- కుంద్రా దంపతులు మోసం చేశారని మార్చిలో ఖర్ పోలీసుల్ని సంప్రదించారట. సత్యుగ్ గోల్డ్ ప్రైవేట్ సంస్థ తనని మోసగించిందని ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కంపనీ ప్రవేశ పెట్టిన గోల్డ్ స్కీమ్ లో ఎన్నారై సచిన్ జోషీ 18. 58 లక్షల విలువ గల కిలో బంగారాన్ని కొనుగోలు చేశారట. ఐదేళ్ల ప్లాన్ ప్రకారం బయ్యర్ గోల్డ్ కార్డ్ ని ఖరీదు చేశారట. తన స్కీమ్ టర్మ్ 25 మార్చి 2019న ముగియడంతో ముంబై బాంద్ర కుర్లాలో వున్న కార్యాలయానికి వెళ్లి బంగారాం తీసుకోవాలని ప్రయత్నించాడట.
అయితే బాంద్రాలో కార్యాలయం మూసివేసి వుండటం అతగాడిని అతఃహశుడిని చేసింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ఎవరూ స్పందించక పోవడం తో సచిన్ జోషి పోలీసుల్ని ఆశ్రయించారు. అయితే సచిన్ జోషి ఆరోపణల్లో వాస్తవం లేదని.. మా సంస్థ లో పెట్టుబడులు పెట్టిన ప్రతీ లబ్దిదారుడు అనుకున్న సమయానికి స్కీమ్ ద్వారా గోల్డ్ ని పొందారని శిల్పాజీ చెబుతున్నారు. సచిన్ జోషి ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. దీనిపై కేసు కూడా ఫైల్ చేశామని.. అతను డబ్బు డిపాజిట్ చేయకపోవడం వల్లనే అతనికి గోల్డ్ ఇవ్వ లేక పోయామని శిల్పాశెట్టి వివరణ ఇచ్చారు.