తెలుగు తెరపైకి ఇంకో వారసుడొచ్చాడు

Update: 2018-07-11 11:07 GMT
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు ఎక్కడ చూసినా వారసులదే హవా. బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్ అని తేడా లేదు. ప్రతి ఇంసడ్ట్రీలోనూ వారసులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఐతే రేషియోలు  చూస్తే మాత్రం టాలీవుడ్ లో ఉన్నంతమంది వారసులు ఇంకెక్కడా ఉండరేమో. గత దశాబ్ద కాలంలోనే పదుల సంఖ్యలో వారసులు తెరమీదికి వచ్చారు. ఈ గురువారం కూడా చిరంజీవి అల్లుడైన కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. అంతకుముందు రోజు టాలీవుడ్లో మరో వారసుడి సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. సీనియర్ నటుడు.. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అయిన శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా పరిచయం కాబోతున్నాడు.

విజయ్ హీరోగా ‘ఏదైనా జరగొచ్చు’ అనే సినిమా మొదలైంది. ‘వెట్ బ్రైన్ ఎంటర్టైన్మెంట్స్’ బేనర్ మీద రమాకాంత్ అనే కొత్త దర్శకుడితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ పెండ్యాల సంగీతాన్నందిస్తున్నాడు. శివాజీ రాజాతో పాటు రాఘవేంద్రరావు.. శ్రీకాంత్.. హరీష్ శంకర్ తదితర ప్రముఖులు ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ‘బిగ్ బాస్-2’ షో ప్రోమోల్లో ‘ఏదైనా జరగొచ్చు’ అనే మాట బాగా పాపులర్ అయింది. ఈ టైటిల్ చూస్తుంటే ఇదేదో థ్రిల్లర్ మూవీ అనిపిస్తోంది. విజయ్ రాజా చూడ్డానికి పర్వాలేదనిపిస్తున్నాడు. చిన్న చిన్న పాత్రలతోనే చాలా ఏళ్ల పాటు పరిశ్రమలో ఉనికిని చాటుకుంటూ వచ్చిన శివాజీ రాజా ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ అనే సినిమాలో హీరోగా కూడా నటించాడు. ఆ తర్వాత బుల్లితెరపై ‘అమృతం’ సీరియల్ అతడికి ఎనలేని పేరు తెచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే ‘మా’లో కీలకంగా ఉంటున్న శివాజీ.. దీనికి అధ్యక్షుడిగా ఉండగానే తన కొడుకుని హీరోను చేశాడు.
Tags:    

Similar News