అందాల కథానాయిక మీరా చోప్రా పవన్ కల్యాణ్ సరసన బంగారం అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాన అనే ప్రేమకథా చిత్రంలో నటించింది. ఆ రెండు సినిమాలు తనకు మంచి గుర్తింపునే తెచ్చినా తెలుగులో ఆశించినంత స్టార్ డమ్ అయితే దక్కలేదు. చివరిగా చేసినవి ఏవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు.
అయితే తాను మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రాకి కజిన్ అన్న సంగతి తెలిసిందే. అందువల్ల తనకు కెరీర్ పరంగా ఏదైనా కలిసొచ్చిందా? అంటే.. కేవలం ఇది పరిచయం వరకూ ఉపయోగపడిందని ఆ తర్వాత పరిశ్రమ తనకు అవకాశాలేవీ ఇవ్వలేదని కూడా తెలిపింది. పీసీ వల్ల తన కెరీర్ కు ఎలాంటి సహాయం అందలేదని కూడా వెల్లడించింది.
``నేను ప్రియాంక బంధువు కాబట్టి నాకు ఎప్పుడూ అవకాశం రాలేదు. ఆ సంబంధం ఆధారంగా ఏ నిర్మాత నన్ను పిలిచి సినిమాల్లోకి తీసుకోలేదు. నాకు ఉపయోగపడిన ఏకైక విషయం ఏమిటంటే నేను సినిమా రంగంతో అనుబంధం ఉన్న కుటుంబం నుండి వచ్చానని నిర్మాతలకు తెలుసు`` అని అన్నారు. వాస్తవానికి తనను ఈ రంగంలో ఎవరూ దోపిడీ చేయడానికి సాహసించలేదని మీరా వెల్లడించారు.