ఆయనకు నేను లక్కీ చార్మ్ ఏంటి?

Update: 2017-08-08 07:07 GMT
సౌత్ ఇండియా హీరోయిన్లో కొంతమంది పూర్తిగా సౌత్ సినిమాలుకే పరిమతం అవుతారు కొంతమంది బాలీవుడ్ లో కూడా తన అదృష్టం పరీక్షించుకొని మళ్ళీ సౌత్ సినిమాలు చేస్తూ ఉంటారు. శ్రీయ శరణ్ కూడా తెలుగు తమిళ్ లో బిజీగా ఉన్న హీరోయిన్నే కానీ ఈ మధ్య ఎందుకో శ్రీయ తన సినిమాలు జోరు పూర్తిగా తగ్గిపోయింది. మళ్ళీ కొన్ని ఏళ్ళు తరువాత బాల కృష్ణ హీరోగా నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో నటించి అందరిని ఆకట్టుకొంది. ఇప్పుడు మళ్ళీ అదే బాలయ్య సినిమాలో హీరోయిన్ రాబోతుంది. శ్రీయ ఈ సినిమాతో బాలయ్యతో జతకట్టడం మూడోసారి. ఈ విషయంగా ఒక మీడియా ఇంటర్వ్యూ లో బాలకృష్ణ గురించి తన కొత్త సినిమా పైసా వసూల్ సినిమా గురించి కొన్ని సరదా కబురులు చెప్పింది.

పూరీ జగన్నాధ్ డైరక్షన్ లో వస్తున్న ‘పైసా వసూల్’ సినిమాలో బాల కృష్ణకు హీరోయిన్ గా శ్రీయ నటిస్తుంది. ఈ సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ “ఇప్పుడు నేను చేయబోతున్న అన్నీ సినిమాలులో కూడా నన్ను నేను కొత్తగా చూడాలి అనుకుంటున్నా. నేను పైసా వసూల్ సినిమాలో చేస్తున్న జర్నలిస్టు పాత్ర కూడా అలాంటిదే. ఈ సినిమాలో నాకు ఒక చిన్న కథ ఉంటుంది. నేను ఎవరు, బాలకృష్ణని ఎలా కలవలిసి వచ్చింది అనేది చాలా  ఆసక్తిగా చెప్పారు పూరీ జగన్నాధ్'' అని చెప్పింది. మీరు బాలయ్య తో మూడో సినిమా చేస్తున్నారు మీరు ఏమైనా ఆయనకు లక్కీ చార్మ్ ఏంటి అని అడిగితే.. “ఇది మరీ టు మచ్ అబ్బా ఆయన 100 సినిమాలు చేశాడు ఆయనకు నేను లక్కీ చార్మ్ ఏంటి నాకే ఆయన లక్కీ చార్మ్'' అని చెప్పింది.

నక్షత్రంలో స్పెషల్ సాంగ్ ఎందుకు చేశారు అంటే “ సినిమా కథ నాకు బాగా నచ్చింది అందుకే సరే అన్నాను అని చెప్పింది.” వీర భోగ వసంతరాయులు సినిమాలో శ్రీయ ఒక పోలీసు అధికారిగా నటిస్తుంది దాని గురించి అడిగితే “అవును ఆ సినిమాలో నేను పోలీసు గా చేస్తున్న. నేను ఇంతవరకు ఎప్పుడు పోలీసు పాత్రలో నటించలేదు. చాలా  ఉత్సాహంగా ఉంది ఎప్పుడు ఎప్పుడు షూటింగ్ చేద్దామా అని చెబుతుంది. ఈ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అని కూడా చెప్పింది శ్రీయ.



Tags:    

Similar News