ఇప్పుడు ఛాన్స్ ఇచ్చేదెవరు?

Update: 2018-05-23 04:53 GMT
ఈ తరంలో టాలీవుడ్ లో సుదీర్ఘ కాలం హీరోయిన్ గా కెరీర్ కొనసాగించిన హీరోయిన్లలో శ్రేయదే రికార్డు దాదాపు 17 సంవత్సరాలకు పైగా హీరోయిన్ గా కొనసాగుతూ చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరి పక్కన ఆడి పాడింది. తర్టీస్ లోనూ హాట్ ఫోజులతో.. గ్లామర్ లుక్స్ తో కనిపించి ప్రొడ్యూసర్స్  అండ్ డైరెక్టర్స్ దృష్టిని ఆకట్టుకునేది.

ఈమధ్య తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూను పెళ్లి చేసుకున్న శ్రేయ సినిమాలకు కాస్త గ్యాపిచ్చింది. కొంతకాలం భర్తతో మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేశాక మళ్లీ సినిమాల వైపు దృష్టి పెట్టింది. తిరిగి సౌత్ లో ఛాన్సులు దక్కించుకోవాలని ఆరాట పడుతోంది. హైదరాబాద్ లో తెలిసిన మేనేజర్లందరికీ ఫోన్ చేసి మరీ తన కోసం ఆఫర్స్ చూడమని అడుగుతోందట. ,నిన్న మొన్నటివరకు సీనియర్ హీరోలకు వైఫ్ క్యారెక్టర్ గా శ్రేయనే కనిపించేది. రెమ్యునరేషన్ కూడా మరీ ఎక్కువేం కాకపోవడంతో డైరెక్టర్లు కూడా శ్రేయను దృష్టిలో పెట్టుకునేవారు.

శ్రేయ పెళ్లి చేసుకోవడంతో దర్శక - నిర్మాతలంతా ఆల్టర్ నేటివ్ హీరోయిన్ల పై దృష్టిపెట్టారు. నయనతార - కాజల్ - తమన్నా కూడా హీరోయిన్లుగా కొనసాగుతుండటంతో వాళ్లకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దాంతో శ్రేయకు సీనియర్ హీరోల పక్కన ఛాన్సులు రావట్లేదు. అలాగయితే ఆమెకు ఇప్పుడు ఛాన్సులిచ్చేదెవరు?
Tags:    

Similar News