కెరీర్ పీక్స్ లో ఉండగానే పర్సనల్ లైఫ్ కి ప్రాధాన్యత అంటూ అన్నిటినీ వదిలిపెట్టి వెళ్లిపోయింది. విదేశీ బోయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో మత్తులో మునిగిపోయి సర్వాన్ని త్యజించింది. అయితే పర్సనల్ లైఫ్ ఏదైనా తనకు సాంత్వన కలిగించిందా? అంటే అదేమీ కనిపించలేదు. ప్రేమ వైఫల్యం చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఆ తర్వాత డిప్రెషన్ నుంచి కోలుకునేందుకే ఏళ్లకు ఏళ్లు పట్టింది. ఇన్నాళ్టికి ఎలాగోలా కుదుటపడుతోంది శ్రుతి లైఫ్.
ఇప్పుడిప్పుడే జనసందోహంలోకి వస్తోంది. మాస్ మహారాజ్ రవితేజ సరసన క్రాక్ అనే చిత్రంలో నటిస్తోంది. బలుపు ఫేం గోపిచంద్ మలినేని ఈ చిత్రంలో రవితేజకు శ్రుతి అయితేనే సరిజోడు అని భావించి ఎంపిక చేసుకున్నారు. అంతా సవ్యంగా సాగితే ఈపాటికే సినిమా రిలీజ్ కావాల్సినది. కానీ వైరస్ మహమ్మారీ ప్రణాళికల్ని దెబ్బ కొట్టింది. అయితే ఈ గ్యాప్ లో శ్రుతి పూర్తిగా వరుస ఫోటోషూట్లతో వేడి పెంచుతోంది. తాజాగా తనకు తానే తీసుకున్న `సెల్ఫ్ షాట్` ఫోటోల్ని రిలీజ్ చేస్తూ అంతకంతకు హీట్ పెంచేస్తోంది. ఇవన్నీ ప్రఖ్యాత జేఎఫ్.డబ్ల్యూ కవర్ పేజీ కోసం సెలెక్ట్ చేసినవి.
నిన్ననే శ్రుతి లేటెస్ట్ షూట్ కి సంబంధించిన జేఎఫ్. డబ్ల్యూ కవర్ పేజీ ఫోటో రిలీజైంది. ఆ తర్వాత సెకండ్ ఫోటో ఇదిగో ఇలా అంతర్జాలంలో వైరల్ గా దూసుకుపోతోంది. పింక్ మఖమల్ డిజైనర్ వేర్ లో శ్రుతి స్టన్నింగ్ అప్పియరెన్స్ మతి చెడగొడుతోంది. ముఖ్యంగా ఆ ఇన్నర్ డిజైన్ లోహకాంతులు తళతళలాడిపోతూ శ్రుతి అందాల్ని పదింతలు పెంచాయి. పింక్ కి కాంబినేషన్ గా ఆ గోల్డ్ షైన్ కలర్ హైహీల్స్ పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యాయి. మేకప్.. డిజైన్ సహా ప్రతిదీ శ్రుతి స్వయంగా సెల్ఫ్ గా రెడీ అయినవే కావడం ఇక్కడ మరో ప్రత్యేకత.