నాన్న పర్సనల్ లైఫ్ మీద నో కామెంట్

Update: 2016-12-27 01:30 GMT
టాలీవుడ్.. కోలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే శృతీహాసన్ కూడా రేస్ లో ఉంటుంది. టాప్ హీరోల పక్కన ఆఫర్సే కాదు.. వరస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న శృతీహాసన్ కి 2016 మిక్డ్స్ రిజల్ట్ ఇచ్చింది. సౌత్ లో హిట్స్.. బాలీవుడ్లో ఫ్లాప్స్ చవిచూసింది. అన్నీ కలిసి 2016లో చాలా విషయాలు నేర్చుకున్నానని.. ప్రొఫెషనల్ గా మరో మెట్టు ఎక్కానంటోంది శృతీహాసన్. ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ ఇష్యూస్ మీద కూడా రియాక్టైంది.

ముఖ్యంగా కమల్- గౌతమి బ్రేకప్ మీద. 13 ఏళ్లు లివిన్ రిలేషన్లో ఉండి రీసెంట్ గా కమల్- గౌతమి ఎవరి దారి వారు చూసుకొన్నారు. కమల్- గౌతమి విడిపోవడానికి శృతీహాసనే కారణమంటూ చాలా విమర్శలే వచ్చాయ్. వీటిపై శృతీ- గౌతమి ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. అయితే ముందు నుంచి నాన్న పర్సనల్ లైఫ్ గురించి నో కామెంట్ అంటోన్న శృతీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలోనూ అదే ఆన్సర్ రిపీట్ చేసింది. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి నేనెవర్ని.. కమల్ కూడా అందుకు మినహాయింపు కాదు కాబట్టి ఇతరుల విషయాలు నన్ను అడగొద్దని క్లియర్ గా చెప్పేసింది.

ఇక కమల్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టమంటోంది శృతీ. కమల్ హాసన్ దర్శకత్వం వహిస్తూ నటిస్తోన్న శభాష్ నాయుడు మూవీలో శృతీ కూడా యాక్ట్ చేస్తోంది. మా నాన్న అని కాదు కాని ఆర్టిస్ట్ గా కమల్ ఎంతో గొప్పవారు. నేను ఆయన కూతుర్ని కాకపోయినా ఇలాగే గౌరవించేదాన్ని.. నాలోని నటి డైరెక్టర్ కమల్ హాసన్ ని ఎప్పుడూ డిజ్పాయింట్ చేయలేదు. ఇంతకన్నా ఏం కావాలి నాకంటూ సంబరపడిపోతుంది శృతీహాసన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News