ఫొటోటాక్ : హీరోయిన్స్‌ ఈమెతో పోటీ పడగలరా?

Update: 2021-11-06 08:18 GMT
ఒకప్పుడు హీరోల భార్యలు మీడియాలో పెద్దగా ఎక్స్ పోజ్‌ అయ్యే వారు కాదు. కొంత మంది హీరోల భార్యలు ఎలా ఉంటారో కూడా చాలా మందికి తెలియదు. కాని ఇప్పుడు హీరోల భార్యలు హీరోయిన్స్ రేంజ్ లో సెలబ్రెటీ హోదాను అనుభవిస్తున్నారు. చాలా మంది యంగ్‌ హీరోల భార్యలు సోషల్‌ మీడియాలో మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. కొందరు భార్యలు వారి భర్తలకు సంబంధించిన విషయాలను చూసుకుంటూ ఉంటే మరి కొందరు హీరోల భార్యలు మాత్రం వ్యాపార రంగంలో దూసుకు పోతున్నారు. అల్లు అర్జున్‌ భార్య స్నేహా రెడ్డి కూడా సొంతంగా వ్యాపార సంస్థలను కలిగి ఉన్నారు. ఆమె కేవలం వ్యాపారాలు మాత్రమే చేయడం కాకుండా ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటారు.

అల్లు స్నేహారెడ్డి తాజాగా షేర్ చేసిన ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఫొటోలో ఉన్న స్నేహా రెడ్డితో ఏ సౌత్ హీరోయిన్‌ అయినా పోటీ పడగలదా అంటూ కొందరు సవాల్ చేస్తున్నారు. అందం తో పాటు మంచి ఫిజిక్ మరియు అనకువ ఉన్న అచ్చమైన తెలుగు అమ్మాయి అందమైనన తెలుగు అమ్మాయిగా స్నేహా రెడ్డి ఈ ఔట్ ఫిట్ లో ఉన్నారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్‌ కు జోడీగా ఒక సినిమా చేయవచ్చు కదా అంటూ స్నేహారెడ్డి షేర్‌ చేసిన ఈ ఫొటోకు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంత అందంగా ఉన్న స్నేహా రెడ్డి పసుపు బంగారు వర్ణం ఔట్ ఫిట్ లో మెరిసి పోతున్నారు. అల్లు అర్జున్‌ ఎంతటి అదృష్టవంతుడు కదా అంటూ ఈ ఫొటోకు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

రెగ్యులర్ గా అల్లు అర్జున్ తో పాటు పిల్లలు అర్హా మరియు అయాన్‌ లకు సంబంధించిన ఫొటోలను మరియు వీడియోలను షేర్‌ చేసే స్నేహా రెడ్డి అప్పుడప్పుడు ఇలాంటి మెరుపులు కూడా వదులుతూ ఉంటారు. ఇలా స్పెషల్‌ ఫొటో షూట్‌ తో జనాల ముందుకు వచ్చిన ప్రతి సారి కూడా స్నేహా రెడ్డి హీరోయిన్ గా ప్రయత్నిస్తే బాగుంటుంది కదా అంటూ చాలా మంది అంటూ ఉంటారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా చాలా అందంగా పడుచు అమ్మాయిగా స్నేహా రెడ్డి ఉన్నారంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక అల్లు అర్జున్‌ పుష్ప సినిమా చివరి దశ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా డిసెంబర్ లో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.




Tags:    

Similar News