మామూలుగా ఒక ఫుల్లు ఇంటర్యూలో.. అక్కడ అడిగిన ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇస్తోంది అనే అంశం చూడకుండా.. కేవలం సమాధానం తీసుకుని దాని నుండి ఒక స్పెషల్ న్యూస్ ఐటెం చేస్తే ఎలా ఉంటుంది? అదేదో కోడిగుడ్డుకు వెంట్రుకలు పీకి.. లేనిపోని రాద్దాంతం చేసినట్లుంది ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు సోనమ్ కపూర్ విషయంలో అదే జరిగింది.
అమ్మడు నో ఫిల్టర్ విత్ నేహా అనే ప్రోగ్రాములో చాలా సూటిగా సుత్తిలేకుండా అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పింది. అయితే అందులో కో-స్టార్స్ ఎవ్వరితోనూ సెక్స్ చేయలేదు అనే ఆన్సర్ కు బాగా పాపులార్టీ వస్తే.. వేరే ఆన్సర్లకు బాగా నెగెటివ్ రియాక్షన్లు వచ్చాయి. దీపికా ఆర్ ప్రియాంక అంటే.. నటిగా ప్రియాంక అనేసింది సోనమ్. ఇక ఆలియా భట్ గురించి చెప్పమంటే.. ఆమె 'వర్జినల్' అంటూ కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ ఆన్సర్లను హెడ్ లైన్స్ గా చేసి.. ''ప్రియాంకే బెటరన్న సోనమ్'' ''ఆలియా వర్జినిటీపై సెటైర్స్'' అంటూ ఆమె సరదాగా చెప్పిన ఆన్సర్లతో గొడవలు క్రియేట్ అయ్యేలా బాలీవుడ్ టాబ్లాయిడ్స్ లో స్టోరీలు వచ్చేశాయి. అవన్నీ సోనమ్ ను బాగా బాధించాయట.
''నేను చెప్పిన సమాధానాలను సందర్భానికి తగినట్లుగా కాకుండా.. బయటకు తీసి చాలా రెచ్చగొట్టే విధంగా పోస్టు చేయడం.. బాగా బాధనిపించింది. కేవలం మీ పబ్లిసిటీ కోసం ఇంత హీనమైన స్థాయికి దిగజారిపోతే ఎలా? నేను చెప్పినవన్నీ కరక్టే.. కాని మీరే అసందర్భంగా వాటిని రాస్తున్నారు'' అంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తూ మొట్టికాయ్ వేసింది సోనమ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/