సినిమాల్లో పేద ప్రజలకు.. ఆపదలో ఉన్నవారికి కష్టమొస్తే నేనున్నా అంటూ వెంటనే హీరో వాలిపోతాడు. వారికి అండగా నిలబడి కొండత ధైర్యాన్ని ఇస్తాడు. అయితే ఇప్పుడు రీల్ విలన్ సోనూసూద్ రియల్ లైఫ్ లో అదే చేస్తున్నాడు. కష్టాల్లో ఉన్నా భాయ్ అని ఒక ట్వీట్ చేస్తే నేనున్నా అంటూ క్షణాల్లో సాయం చేసేందుకు ముందుకొస్తున్నాడు. కష్టం తెలిసిన వాడే సాయం చేస్తాడు అని నిరూపిస్తూ ఎందరి జీవితాలకో భరోసా కల్పిస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి దేశవ్యాప్తంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనస్సులు గెలుచుకొని.. రియల్ హీరోగా అందరి మన్ననలు పొందుతున్నాడు సోనూ సూద్. ఈ క్రమంలో తాజాగా సోనూ సూద్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. ఒక బాలుడి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం రూ. 20 లక్షల ఆర్ధిక సాయం చేసేందుకు సోనూసూద్ ముందుకు వచ్చాడు.
తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా పెరుమాండ్ల సంకీస గ్రామానికి చెందిన నాగరాజు - లక్ష్మీ దంపతుల కుమారుడు హర్షవర్ధన్6) ఆరున్నర నెలల నుంచి లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. అయితే ఈ మధ్య అతడి పరిస్థితి విషమించడంతో.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. బాలుడికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ చేయాలని.. రూ. 20 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. వారికి అంత స్థోమత లేకపోవడంతో సోనూసూద్ ను సహాయం కోరాలని అనుకున్నారు. ఇటీవల షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన సోనూసూద్ ను నాగరాజు దంపతులు కలుసుకున్నారు. తన కొడుకు సమస్యను సోనూసూద్ కు వివరించి సాయం చేయాలని కోరారు. దీనికి వెంటనే స్పందించిన సోనూసూద్ హర్షవర్ధన్ వైద్యానికి అవసరమయ్యే రూ. 20 లక్షలు ఇస్తానని ప్రకటించాడు. సాయానికి పర్యాయపదంగా మారిపోయిన సోనూసూద్ గొప్ప మనసుని మరోసారి అందరూ కొనియాడుతున్నారు.