బిగ్ బాస్ సీజన్ -3 మరో వారంలో ముగియనుంది. 17 మంది కంటెస్టంట్స్ తో మొదలైన షోలో ఐదుగురు సభ్యులు ఫినాలేకు చేరుకున్నారు. వీరిలో ఒకరు విన్నర్ గా నిలవనున్నారు. మరి ఈ వారం బిగ్ బాస్ ఆడించే గేమ్ బట్టే కంటెస్టంట్స్ భవితవ్యం ఆధారపడి ఉంది. బిగ్ బాస్ ఎవరినైనా బ్యాడ్ చేయాలనుకుంటే చేయగలరు... ఎవరికైనా సహకరించాలనుకుంటే సహకరించగలరు. కంటెస్టంట్స్ మధ్య పెద్ద పెద్ద గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో ఈ ఫినాలే వారంలో ఏదైనా జరగొచ్చు.
ఇక ఆదివారం ఎపిసోడ్ లో ఊహించని విధంగా శివజ్యోతి ఎలిమినేట్ అయిపోయి - మిగిలిన ఐదుగురు...బాబా భాస్కర్ - శ్రీముఖి - రాహుల్ - వరుణ్ - అలీ ఫైనల్ కు చేరుకున్నారు. వీరే ఈ వారం బిగ్ బాస్ సీజన్ టైటిల్ కోసం పోరాడానున్నారు. అయితే ప్రేక్షకుల్లో అంచనాలు ప్రకారం చూసుకుంటే శ్రీముఖి - రాహుల్ - బాబా భాస్కర్ ల్లో ఒకరు విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వరుణ్ - అలీల పట్ల ప్రేక్షకుల్లో అంత అంచనాలు ఏమి లేవు.
అందులోనూ అలీ ఎలిమినేట్ అయ్యి మళ్లీ లోపలకు రావడమే గొప్ప. రీ ఎంట్రీ ఇచ్చాక అలీ తీరు పూర్తిగా మారిపోయింది. ఇక వరుణ్ చివర్లో భార్య కోసం ఆడిన సేఫ్ గేమ్ నేపథ్యంలో వీక్ అయ్యాడు. కాబట్టి శ్రీముఖి - బాబా భాస్కర్ - రాహుల్ ల్లోనే టఫ్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. ఈ వారం వీరు ఆడే గేమ్ బట్టే విన్నర్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే శ్రీముఖి - రాహుల్ ల్లో ఒకరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి.
ఏమైనా అంచనాలు అటు ఇటు అయితే బాబాకు కూడా గెలిచే ఛాన్స్ బాగానే ఉంది. బాబా ముందు నుంచి శ్రీముఖికి గట్టి పోటీదారుడిగా ఉన్నా చివర్లో రాహుల్ అనూహ్యంగా పుంజుకుని అందరికి షాక్ ఇచ్చాడు. బాబా పోటీలో ఉన్నా కానీ శ్రీముఖి - రాహుల్ మధ్య గట్టి పోటీనే జరగనుంది. చూడాలి మరి ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్ గా ఎవరు నిలుస్తారో?