మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ కు సంబంధించిన నిధులను అధ్యక్షుడు శివాజీ రాజా మరియు ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ దుర్వినియోగం చేశారంటూ వచ్చిన కథనాలు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు టాలీవుడ్ లో పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ కథనాలను ఖండిస్తూ శివాజీ రాజా - శ్రీకాంత్ లు మీడియా ముందు క్లారిటీ ఇచ్చారు. అయితే, ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టిన నరేష్...తర్వాత ప్రత్యేకంగా మీడియా ముందుకు వచ్చి `మా`లో అవకతవకలు జరిగాయని, వాటిపై ఒక ఫ్యాక్ట ఫైండింగ్ కమిటీ వేయాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి వ్యవహారంలో మా తీరును నరేష్ తప్పుబట్టారు. శ్రీరెడ్డి విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొన్నామని అన్నారు. ఈ నేపథ్యంలో నరేష్ వ్యాఖ్యలపై నటి శ్రీరెడ్డి స్పందించింది. శివాజీరాజా - శ్రీకాంత్ లపై సంచలన ఆరోపణలు చేసింది.
నరేష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. తాను చేస్తోన్న పోరాటాన్ని శివాజీ రాజా - శ్రీకాంత్ పబ్లిసిటీ స్టంట్ అన్నారని - అందుకే వారికి గోచీ ఊడి దరిద్రపు గతి పట్టిందని చెప్పింది. తాను మోసపోయి వస్తే ఓదార్చాల్సింది పోయి బడా ఫ్యామిలీస్ ని కాపాడే ప్రయత్నం చేశారని మండిపడింది. తనకు కోట్ల రూపాయలు ఇచ్చి మభ్యపెట్టాలని శివాజీ రాజా, అతడి తొత్తులు ప్రయత్నించి విఫలమయ్యారని చెప్పింది. వారి పనికి తన కడుపు మండిందని, తన విషయంలో శివాజీ రాజా బిహేవియర్ బాధాకరమని చెప్పింది. వారు....ఆడపిల్లని కాల్చుకు తినే బ్రోకర్స్ అని - సెటిల్ మెంట్స్ చేసే గుండాలు అని షాకింగ్ కామెంట్స్ చేసింది. తన తల్లిదండ్రులనే చూడలేని శివాజీ రాజా ముసలోళ్లకి వృద్దాశ్రమం గురించి అమెరికాలో గంతులేసారని చెప్పడం హాస్యాస్పదమని చెప్పింది. అందరూ తోడు దొంగలేనని, ఆ డబ్బంతా పంచుకుతిన్నారని ఆరోపించింది. ఆ మొత్తంలో ఓ బడా హీరో వాటా చాలా పెద్ద మొత్తం అని చెప్పింది. అమెరికాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తన దగ్గర ఉందని, ఆడపిల్ల ఏడుపు ఉత్తినే పోదని చెప్పింది. ముందు ఉంది ముసళ్ల పండగ - కీప్ ఇట్ అప్ నరేష్ గారు... అని శ్రీరెడ్డి పోస్ట్ చేసింది.