బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ తో సినిమా అంటే మాటలా? మాట్లాడితే డబ్బు తో కొట్టాలి. నోట్ల కట్టలు, భారీ కానుకలు కుమ్మరించాల్సిందే. అలా లేదంటే పనవ్వదు. పారితోషికం ఒక ఎత్తు అయితే, వ్యక్తిగత స్టాఫ్ కి చెల్లించుకోవాల్సిన ఛార్జీలు, ఇతర భాషల్లో అనువాదం చెప్పాలంటే ఇచ్చుకోవాల్సిన భారీ మొత్తాలు, ప్రమోషన్ కోసం అదనపు పారితోషికం .. ఇవన్నీ ఉంటాయి. ప్రతిదీ అగ్రిమెంట్ పరిధిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే మినిమం ఐదారు కోట్లు ఊడ్చేయనిదే హీరోయిన్ తో ఒప్పందం కుదరదు.
ముఖ్యంగా ఈ విషయంలో అలనాటి మేటి నాయికగా, అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న ఓ కథానాయిక గురించి కోలీవుడ్‌లో సీరియస్‌గా డిష్కసన్ సాగుతోంది. ఈ భామ పులి సినిమాలో నటించినందుకు నిర్మాతల చెవులు పిండి మరీ అదనపు మొత్తాల్ని వసూలు చేస్తోందని ప్రచారం సాగుతోంది. కోలీవుడ్ తో పాటు అనువాద భాషల్లోనూ డబ్బింగ్ చెప్పాలంటే 1 కోటి అదనపు మొత్తం డిమాండ్ చేసిందని అప్పట్లో వార్తలొచ్చాయి. దీంతో పాటు హిందీలో పులి రిలీజ్ విషయంలో ఈ సుందరి హజ్బెండ్ ఇన్వాల్వ్మెంట్ ఉందని , అతడు షాడో ఇన్వెస్టర్‌గా పెట్టుబడులు సమకూర్చారని సమాచారం. అందుకే పులి పాన్ ఇండియా రిలీజ్ బాధ్యతలు అతడివేనని ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది.
పులి బాలీవుడ్లో భారీగా రిలీజవ్వడానికి అతిలోక సుందరి హ్యాండ్ బాగా పనిచేస్తోందని తెలుస్తోంది.. డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అంతా ఈ సీనియర్ నటీమణి కనుసన్నల్లోనే ఉన్నారని చెబుతున్నారు. అంతేనా పులి చిత్రంలో మహారాణి పాత్రలో నటించినందుకు 6 కోట్ల పారితోషికం అందుకున్న ఈ సీనియర్ నాయిక డబ్బింగ్ కోసం అదనంగా కోటి అందుకుంది. ఇప్పుడు ట్విట్టర్లో ప్రమోషన్ కోసం ఇంకేమైనా అదనంగా దండుకుంటోందా? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది.