శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ మరోసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీతో బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. అతడు నటించిన `ఆపరేషన్ 2019` నవంబర్ 9న రిలీజవుతోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ తన స్వగృహంలో పాత్రికేయులతో ముచ్చటించారు. రాజకీయాలపై సంధించిన రావణాస్త్రం `ఆపరేషన్ 2019` అని శ్రీకాంత్ తెలిపారు. ఇది ఏ ఒక్కరినో టార్గెట్ చేసినది కాదు.. అధికార పక్ష విధానాలనే కాదు - ప్రతిపక్ష - విపక్షాల్లోని అవినీతి రాజకీయ నాయకుల్ని ఈ సినిమా టార్గెట్ చేసిందని తెలిపారు.
శ్రీకాంత్ హీరోగా అలివేలమ్మ ప్రొడక్షన్స్ సమర్పణలో టి. అలివేలు నిర్మించిన కరణం బాబ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆపరేషన్ 2019` కంటెంట్ పరంగా పూర్తిగా రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ప్రజానుకూలంగా ఉంటుందని - ప్రజల తరపున పోరాటమిదని శ్రీకాంత్ తెలిపారు. కథ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ప్రత్యేకించి ఏ పార్టీని బేస్ చేసుకుని కాదు. ఎలక్షన్స్ సందర్భంగా ప్రజల్లో ఎవేర్ నెస్ పెంచడం కోసం చేసిన మూవీ ఇది. ఒక సామాన్య వ్యక్తి పొలిటీషియన్ అయితే అతను ఎదుర్కొనే పరిణామాలు ఎలా ఉంటాయి? ఏవిధంగా రాజకీయ నాయకులు చేసే పొరపాట్లు సమస్యల్ని తెస్తాయి? అన్న కోణంలో ఉంటుంది అని తెలిపారు. ``అసలు ఈ సినిమా ఏ ఒక్క పార్టీనో టార్గెట్ చేయదు`` అని కథానాయకుడు శ్రీకాంత్ అంటున్నా.. కచ్ఛితంగా ఇది తెలంగాణలో అధికార పార్టీ తేరాసకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉందన్న స్పెక్యులేషన్ రన్ అవుతోంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ తో పాటు మంచు మనోజ్ ఓ కథానాయకుడిగా కనిపించనున్నాడు.
ఇది ఆపరేషన్ దుర్యోధన మూవీకి సీక్వెల్ కానే కాదని శ్రీకాంత్ వెల్లడించారు. తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ.. మొన్ననే కన్నడలో ఒక సినిమా చేశాను అందులో నెగిటివ్ క్యారెక్టర్ లో చేశాను. అక్కడ ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. మలయాళంలో కూడా ఒక సినిమా చేశాను. తెలుగులో `మార్షల్ `అనే ఒక చిత్రం చేస్తున్నాను షూటింగ్ అవుతుంది. ఆ చిత్రానికి జయరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్ కూడా నటించారు... అని తెలిపారు.