సీమలో మాత్రం ‘శ్రీమంతుడు’ కాదు

Update: 2015-08-22 14:34 GMT
శ్రీమంతుడుతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు మహేష్ బాబు. తొలి రోజు నుంచి నాన్-బాహుబలి రికార్డుల్ని ఒక్కొక్కటిగా చెరిపేస్తూ వస్తున్నాడు. రెండు వారాలకే అత్తారింటికి దారేది పేరు మీద ఉన్న లైఫ్ టైం కలెక్షన్ల రికార్డుల్ని చాలా వరకు దాటేశాడు. ప్రస్తుతానికి బాహుబలి, అత్తారింటికి దారేది తర్వాతి స్థానం శ్రీమంతుడిదే. ఫుల్ రన్ లో అత్తారింటికి దారేది రికార్డులు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. వంద కోట్ల షేర్ అందుకుని సంచలనం సృష్టించినా ఆశ్చర్యమేమీ లేదు. ఐతే చాలా ఏరియాల్లో ‘శ్రీమంతుడు’ హవా సాగింది కానీ.. మహేష్ కు పెద్దగా పట్టులేని రాయలసీమలో మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు.

సీడెడ్ ఏరియాలో రెండు వారాలకు ‘శ్రీమంతుడు’ రూ.8 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. మహేష్ బాబు వరకు ఇవి రాయలసీమలో కెరీర్ బెస్ట్ కలెక్షన్లే. కానీ ఓవరాల్ గా చూస్తే మాత్రం ‘శ్రీమంతుడు’ తొమ్మదో స్థానంలో ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. బాహుబలి రూ.21 కోట్ల షేర్ తో సీమలో అగ్రస్థానంలో ఉంది. దాని సంగతి పక్కనబెట్టేద్దాం. అది కాకుండా ఏడు సినిమాలు ‘శ్రీమంతుడు’ కన్నా ముందున్నాయి. మగధీర (రూ.12.72 కోట్లు), అత్తారింటికి దారేది (రూ.10.25 కోట్లు), గబ్బర్ సింగ్ (రూ.9.3 కోట్లు), లెజెండ్ (రూ.8.6 కోట్లు), బాద్ షా (రూ.8.35 కోట్లు), రేసుగుర్రం (రూ.8.32 కోట్లు), రచ్చ (రూ.8.2 కోట్లు) శ్రీమంతుడు కన్నా ముందున్నాయి. ఇప్పటికే సీడెడ్ లో ‘శ్రీమంతుడు’ జోరు తగ్గిపోయింది. ఇక ఎంత కష్టపడ్డా కూడా మూణ్నాలుగు స్థానాలు ముందుకెళ్లొచ్చేమో కానీ గబ్బర్ సింగ్ రికార్డును కూడా అందుకోవడం కష్టమే. మగధీర, అత్తారింటికి దారేది రికార్డుల నైతే టచ్ చేసే అవకాశమే లేదు.
Tags:    

Similar News