పుష్ప - ది రైజ్ పాటలు వెబ్ ప్రపంచంలో మాయాజాలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రెడిట్ బన్ని-రష్మిక- దేవీశ్రీ త్రయానిదే. ఇక ఈ మూవీ నుంచి శ్రీవల్లీ పాట యువతరంలోకి వైరల్ గా దూసుకెళ్లింది. సినీక్రీడా రంగం నుంచి సెలబ్రిటీలు అనుకరించేంతగా ఈ పాట దూసుకెళ్లడం గొప్ప విశేషం.
ఇప్పుడు శ్రీవల్లి ఇంగ్లీష్ వెర్షన్ వెబ్ ని షేక్ చేస్తోంది. చాలా మంది వ్యక్తులు సాధారణంగా తాము పాడిన సూపర్ హిట్ పాటల వెర్షన్ ను సోషల్ మీడియాలో రికార్డ్ చేస్తారు.. వాటిని ఒరిజినల్ కంపోజర్ లతో షేర్ చేస్తారు. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ గాయని ఎమ్మా హీస్టర్స్ శ్రీవల్లి ఆంగ్ల వెర్షన్ ను రికార్డ్ చేసారు. ఇదే విషయాన్ని దేవీశ్రీ ట్విట్టర్ లో షేర్ చేశారు. దీనిపై దేవీ శ్రీ ప్రసాద్ ఇలా రాసారు. ``ఇది బాగా నచ్చింది. హే @సిధ్ శ్రీరామ్ బ్రో.. మనం రికార్డ్ చేసినప్పుడు నేను మీకు చెప్పాను, ఇంగ్లీష్ వెర్షన్ 4 ఫన్నీగా చేద్దామని... కానీ ఇక్కడ ఎమ్మా హీస్టెర్స్ అందంగా పాడారు. మేము ప్రయత్నిస్తే మా మార్పు చేర్పుల్ని కూడా చేస్తాం`` అని మూవీ తారాగణం సిబ్బందికి ట్యాగ్ చేసారు. తెలుగు- తమిళం- కన్నడ- మలయాళం భాషల్లో శ్రీవల్లి పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించారు. హిందీ వెర్షన్ లో జావేద్ అలీ రూపకల్పన చేశారు.
పుష్ప తెలుగును మించి హిందీలో హిట్టయ్యింది. అక్కడ దాదాపు 100 కోట్లు వసూలు చేసింది. తదుపరి పార్ట్ 2 కూడా తెరకెక్కనుంది. సుకుమార్ అందుకోసం వేగంగా స్క్రిప్టును రెడీ చేస్తున్నారని సమాచారం. ఏప్రిల్ నుంచి పార్ట్ 2 చిత్రీకరిస్తామని ఇదివరకూ తెలిపారు. ఇంకా పుష్ప - ది రైజ్ పాటలు దూసుకెళుతూనే ఉండడం ట్రెండింగ్ గా మారడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగు సినిమా ఖ్యాతి వరల్డ్ వైడ్ వేగంగా విస్తరిస్తోందనడానికి ఇవన్నీ సింబాలిక్ అని చెప్పాలి.
Full View