చంద్ర‌బాబుపై వ్యాఖ్య‌ల‌ను ఖండించిన రాజ‌మౌళి సోద‌రుడు.. విష‌యం ఏంటంటే!

Update: 2021-08-09 04:56 GMT
టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి ఒక విష‌యంలో మ‌ద్ద‌తుగా నిలిచారు.. ద‌ర్శ‌క దిగ్గ‌జం ఎస్‌.ఎస్. రాజ మౌళి సోద‌రుడు ఎస్ ఎస్ కంచి(అమృతంలో అంభుజ‌నాభం). చంద్ర‌బాబు వివాదాస్ప‌ద‌ వ్యాఖ్య‌లు చేశార‌ని అంటున్న వారిపై ఒక రేంజ్‌లో ఆయ‌న విరుచుకుప‌డ్డారు. `ఇలాంటివి అన‌వ‌స‌రం` అంటూ.. బాబుకు మ‌ద్ద‌తుగా కామెంట్లు  చేశారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు సినీ రంగానికి చెందిన వారు.. మ‌రీ ముఖ్యంగా రాజ‌మౌళి కుటుంబం.. ఇలా ఎప్పుడూ రాజ‌కీయ నేత‌ల‌ను వెనుకేసుకు వ‌చ్చిన ప‌రిస్థితి లేదు. అందునా.. ఇలాంటి కీల‌క వ్యాఖ్య‌ల విష‌యంలో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా మాట్లాడింది కూడా లేదు.

కానీ, అనూహ్యంగా ఎస్‌.ఎస్‌. కంచి మాత్రం చంద్ర‌బాబును వెనుకేసుకు వ‌చ్చారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. చంద్ర‌బాబుపై ఒక విమ‌ర్శ ఉంది. ఉమ్మ‌డి ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో చంద్ర‌బాబు.. రైతుల‌ను కించ‌ప‌రిచార‌ని, వారికి ఏ విధంగానూ సాయం చేయలేద‌ని.. గ‌తంలో కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శించేవారు. మ‌రీ ముఖ్యంగా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని అన్న‌దాతల ఆత్మ‌బం ధువుగా తీర్చిదిద్దే క్ర‌మంలో చంద్ర‌బాబును భారీగానే టార్గెట్ చేశారు. ఈ క్ర‌మంలోనే ``వ్య‌వ‌సాయం దండ‌గ‌`` అని చంద్ర‌బాబు అన్న‌ట్టుగా భారీ ఎత్తున ఆయ‌న‌ను విమ‌ర్శించేవారు. ఇదే విష‌యంపై కాంగ్రెస్ నేత‌లు.. చాలా మంది గ‌తంలో బాబును ఇరుకున పెట్టారు.

ఇక‌, ఆ త‌ర్వాత రాజ‌కీయ అరంగేట్రం చేసిన వైఎస్ త‌న‌యుడు, ప్ర‌స్తుత ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత పార్టీ వైసీపీ నేత‌లు కూడా చంద్ర బాబును ఇవే కామెంట్లు అడ్డు పెట్టి.. రాజ‌కీయంగా టార్గెట్ చేయ‌డం తెలిసిందే. వైసీపీ ఫైర్ బ్రాండ్లు.. రోజా, కొడాలి నాని వంటివారు.. త‌ర‌చుగా.. వ్య‌వ‌సాయం దండ‌గ అన్న చంద్ర‌బాబుకు రైతుల గురించి, వారికి అందిస్తున్న ల‌బ్ధి గురించి మాట్లాడే అర్హ‌త లేదంటూ.. రెచ్చిపోయిన విష‌యాలు తెలిసిందే. అయితే.. దీనికి సంబంధించి చంద్ర‌బాబు రియాక్ట‌యి.. ``ఏదీ ఆ కామెంట్ల‌కు ఆధారాలు చూపండి!`` అంటే.. మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క‌రూ ముందుకు వ‌చ్చి .. బాబు చేసిన‌ట్టు చెబుతున్న కామెంట్ల‌కు ఆధారాల‌ను చూపించ‌లేక పోయారు.

ఇప్పుడు ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. ఎస్ ఎస్ రాజ‌మౌళి సోద‌రుడు కంచి.. హాట్ కామెంట్లు చేశారు. “సరే… దండగ అన్నాడు… (అనుకుందాం). ఇంతకీ ఎవరైనా తల్లితండ్రులు వాళ్ళ పిల్లల్ని నువ్వు ఆరు నూరైనా రైతువి అయ్యి వ్యవసాయం చెయ్యాలని కోరుకుంటున్నారా? (వారసత్వ రైతు కుటుంబాల్లోనైనా)`` అని నిల‌దీశారు. సంప్ర‌దాయ వ్య‌వ‌సాయ కుంటుంబాల్లోని వారే త‌మ పిల్ల‌లను ఉద్యోగులుగానో.. కంప్యూట‌ర్ ఇంజ‌నీర్లుగానో చూసుకోవాల‌ని మురిసిపోతున్నారంటూ.. కామెంట్ చేశారు.

 కేవ‌లం చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తివ్వ‌డమే కాకుండా.. బాబు వ్యాఖ్య‌ల‌పై త‌ర‌చుగా ప్ర‌భుత్వ అనుకూల మీడియాలో జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌పై కూడా కంచి ఫైర‌య్యారు. బాబు కామెంట్లను స‌రైన విధంగా అర్ధం చేసుకోలేక పోయారేమో! అని ఆయ‌న వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. కంచి చేసిన కామెంట్లు ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాకుండా.. అటు.. సినీ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌కు దారితీశాయి.
Tags:    

Similar News