ఎస్.ఎస్.కార్తికేయ.. టాలీవుడ్ జనాలకు పరిచయం అక్కర్లేని పేరు. రాజమౌళి కొడుకుగా తెచ్చుకున్న గుర్తింపు కంటే తన సొంత టాలెంట్ తోనే ఎక్కువ గుర్తింపు సంపాదించాడు ఈ కుర్రాడు. ‘షోయింగ్ బిజినెస్’ పేరుతో మేకింగ్ వీడియోలూ అవీ రెడీ చేసే సంస్థను ఏర్పాటు చేసి దాన్ని సక్సెస్ చేయడమే కాదు.. రాజమౌళి సినిమాలకు పలు విభాగాల్లో పని చేస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాకు కార్తికేయ నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ‘బాహుబలి’ సినిమాకు కార్తికేయ సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించిన నేపథ్యంలో జక్కన్న బాటలో అతనూ దర్శకత్వం చేపడతాడని చాలామంది భావించారు.
ఐతే కార్తికేయకు అలాంటి లక్ష్యాలేమీ లేవట. ఆ మధ్య రాజమౌళి చెప్పినట్లే అతను ప్రొడక్షన్ వ్యవహారాలకే పరిమితం కావాలనుకుంటున్నాడట. కార్తికేయ తల్లి రమ కూడా ఈ విషయమే చెబుతోంది. ‘‘బాహుబలి సినిమాకు కార్తికేయ సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా చేశాడు. ఐతే తనకు దర్శకత్వ విభాగం సూటవ్వదు. ప్రొడక్షన్ లోనే కెరీర్ చూసుకుంటున్నాడు. వివిధ రకాల పరిస్థితుల్ని హ్యాండిల్ చేయడంలో కార్తికేయ బెస్ట్. అదే అతని బలం. ఓ దర్శకుడికి ఉండాల్సిన ఫోకస్ అతడికి లేదు. కష్టపడతాడు కానీ.. స్థిరంగా ఒక చోట కూర్చుని పని చేయలేడు. రాజమౌళికి ఏం కావాలో అతడికి బాగా తెలుసు కాబట్టి సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా పని చేశాడు తప్ప అతడికి దర్శకత్వం మీద ఆసక్తి లేదు. ఈ పని చేశావు కదా.. మరి డైరెక్టర్ అవుతావా అని అడిగితే.. ‘నాకిప్పుడు మరింత క్లారిటీ వచ్చింది. డైరెక్షన్ లోకి అస్సలు వెళ్లను’ అనేశాడు. కాబట్టి అతణ్ని దర్శకుడిగా మారమని ఒత్తిడి చేయను’’ అని రమ తెలిపింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/