హీరోగా రాజమౌళి కొడుకు!?

Update: 2016-11-22 17:30 GMT
హీరోల కొడుకులు హీరోలవ్వడం కామనే కానీ డైరెక్టర్స్ కొడుకులు హీరోలుగా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవడం ఎప్పుడోగానీ జరగదు. అలా హీరోలై నిలదొక్కొన్న వారు టాలీవుడ్లో చాలా తక్కువమంది ఉన్నారు. గోపీచంద్.. అల్లరి నరేష్.. పూరీ ఆకాష్ తర్వాత ఇప్పుడా లిస్ట్ లో కొత్త పేరు యాడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్. దర్శకధీరుడు రాజమౌళి తన కొడుకు కార్తీకేయని త్వరలో హీరోగా మార్చే ప్రయత్నాల్లో ఉన్నారనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయ్.

బాహుబలి- ద బిగినింగ్ ఆడియో ఫంక్షన్లో సినిమాకి పడ్డ కష్టం గురించి చెప్పి ఎమోషనలైన రాజమౌళి పుత్రరత్నం కార్తీకేయకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. అందరి కష్టం ఒకెత్తు కార్తీకేయ ఒక్కడు పడ్డ కష్టం మరో ఎత్తు. వాడు లేకపోతే నేను అసలు ఈ మూవీని తీయలేకపోయేవాడినేమో అంటూ ఫస్ట్ టైమ్ కొడుకు మీద పొగడ్తలు కురిపించాడు. ఇక కార్తీకేయకి షోయింగ్ బిజినెస్ అని కొత్త సినిమాల ట్రైలర్స్.. మేకింగ్ వీడియోస్ తయారు చేసిచ్చే కంపెనీ కూడా ఉంది. దీంతో చాలామంది రాజమౌళి వారసత్వాన్ని కార్తీకేయ పుణికి పుచ్చుకుంటాడని త్వరలో మెగాఫోన్ పడతాడనుకుంటున్నారు.

కానీ రాజమౌళి మాత్రం కొడుకుని డైరెక్టర్ గా కాకుండా హీరోగా మార్చే ఆలోచనలో ఉన్నాడట. దీనికి సంబంధించి కార్తీకేయకి ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నారని.. బాహుబలి-2 ఫినిషైన తర్వాత కార్తీకేయ లాంఛింగ్ ఉండొచ్చంటున్నారు. సినీ రంగానికి సంబంధించి దాదాపు అన్ని రంగాల్లో రాజమౌళి ఫ్యామిలీ ఉంది. తండ్రి రైటర్.. తాను దర్శకుడు.. అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్.. వదిన లైన్ ప్రొడ్యూసర్.. భార్య కాస్ట్యూమ్స్ డిజైనర్.. మిగిలిన వాళ్లు ఇతర డిపార్ట్ మెంట్స్ లో ఉన్నారు. ఇప్పుడు కార్తీకేయ హీరో అయితే 24 క్రాఫ్ట్స్ ని రాజమౌళి ఫ్యామిలీ ఫిల్ చేసినట్టే. మరి ఇతర హీరోలకి స్టార్ డమ్ ఇచ్చిన జక్కన తన కొడుకుని ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News