ఒక యువ దర్శకుడిని దేశం గర్వించదగ్గ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రశంసించడమే గాక.. అతడిలో తనని తాను చూస్తున్నానని అనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిన్న సెప్టెంబర్ 2న హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రేక్షకులను అలరించడానికి బ్రహ్మాస్త్ర చిత్ర బృందం సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో ఈవెంట్ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తూ చిత్ర బృందం కొన్ని గంటల వ్యవధిలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగింది. ఈ చిత్రానికి సమర్పకుడిగా ఎస్ ఎస్ రాజమౌళి ప్రచార బాధ్యతల్ని స్వీకరించారు. తన సొంత సినిమా కంటే ఎక్కువగా అయాన్ ముఖర్జీ-కరణ్ జోహార్ ల చిత్రాన్ని ప్రమోట్ చేస్తుండడం ఆసక్తికరం.
ఈ కార్యక్రమానికి హీరో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నటీమణులు అలియా భట్- మౌని రాయ్ కూడా పాల్గొన్నారు.
#బ్రహ్మాస్త్ర - మొదటి భాగం: శివ గురించి ప్రస్థావిస్తూ హైదరాబాద్ ఈవెంట్ S S రాజమౌళి తనని తాను అయాన్ ముఖర్జీలో చూసుకున్నానని అన్నారు. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో నాగార్జున సూపర్ పవర్ గురించి రాజమౌళి ప్రశంసలు కురిపించారు. బ్రహ్మాస్త్రంలో రణబీర్ కపూర్ కు నిప్పులు కురిపించే శక్తి ఉంది. రామోజీ ఫిలింసిటీలో అనుకున్నట్టు జరిగితే ఈవెంట్ లో స్టేజ్ పై ప్రత్యక్ష ప్రసారం చేయడానికి మేము ప్లాన్ చేసాము. కానీ కుదరలేదు... బ్రహ్మాస్త్ర సక్సెస్ వేడుకలో మేము ప్రత్యేక ప్రదర్శన చేస్తాము! అని కూడా తెలిపారు.
ఆ తర్వాత బ్రహ్మాస్త్ర నిర్మాత కరణ్ జోహార్ గురించి ఎస్.ఎస్ రాజమౌళి గొప్ప ప్రశంసలు కురిపించారు.. కరణ్.. నేను చేసే సినిమాకి చాలా తేడా ఉంది. కానీ అతడి సినీ అభిరుచిని నేను అభినందిస్తున్నాను. 5 సంవత్సరాల క్రితం అయాన్ ముఖర్జీ అనే పిచ్చివాడితో బ్రహ్మాస్త్ర తరహా సినిమా చేయడానికి ప్రయత్నించానని తెలిపాడు. ఈ ప్రయత్నంలో భాగం కావాలని కరణ్ కోరగాతన పట్ల నాకున్న గౌరవం అలాగే స్నేహం కారణంగా నేను అంగీకరించాను. కానీ అప్పుడు నాకు బ్రహ్మాస్త్రం గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు వారితో చేరాను.. అని తెలిపారు.
అయాన్ ముఖర్జీ నాకు కథ వినిపిస్తూ.. అస్త్రాల గురించి చెప్పడం ప్రారంభించగానే నా చిన్ననాటి కల్పనలన్నీ సజీవంగా నాకు అందులో కనిపించాయి. నేను నిజంగా చెప్పుకోదగ్గ మరో విషయం ఏమిటంటే అతను ఆస్ట్రావర్స్ ను రూపొందించడానికి పెట్టుబడి పెట్టిన సమయం అతడి శక్తి. అలాంటి సినిమా చేయాలని నేను భావించాను. దక్షిణ భారత దేశంలో సాధ్యమైనంత వరకూ ఈ చిత్రానికి మన మద్దతు ఇవ్వాలి. ఇది మన ఇతిహాసాలలో ఉన్న పురాణాలలో ప్రస్తావించిన సూపర్ హీరోల గురించిన సినిమా. బ్రహ్మాస్త్రం అనేది భారతీయత భారతీయ భావోద్వేగాలకు సంబంధించినది.. అని అన్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ ఎందుకు జరగలేదో రాజమౌళి వెల్లడించారు. ఏర్పాట్లు అద్భుతంగా చేశాం. కానీ గణేష్ నిమజ్జనం కారణంగా పోలీసులు ఈ కార్యక్రమానికి తగినంత సిబ్బందిని అందించలేకపోయారు. అందుకే ఆ కార్యక్రమం జరగలేదని తెలిపారు.
అయాన్ ముఖర్జీ ఈ గ్రాండ్ ఈవెంట్‌లో భాగం కాలేకపోయాడు, సినిమాకు సంబంధించి ఇంకా కొంత పని మిగిలి ఉందని అయాన్ నాకు తెలిపారు. అతను ముంబైలో ఉండాలా లేదా ఈ ఈవెంట్ కోసం హైదరాబాద్ రావాలా అని నన్ను అడిగాడు. అప్పుడే నేను అతనిలో నన్ను నేను చూసాను. అతను వెనక్కి తగ్గాలని ప్రమోషన్స్ మేము చూసుకుంటామని నేను పట్టుబట్టాను! ఎందుకంటే చివరికి ప్రేక్షకులతో మాట్లాడబోయేది సినిమానే కదా! అని రాజమౌళి అన్నారు.
బ్రహ్మాస్త్రలో నాగార్జున అక్కినేని పాత్ర వివరాలను చెపుతూ ఎస్ ఎస్ రాజమౌళి నవ్వులు పూయించారు. అయాన్ కి గుండెపోటు వస్తుంది! కానీ ఆయన (నాగార్జున అక్కినేని) నంది అస్త్రాన్ని కలిగి ఉన్నారని మీరందరూ ట్రైలర్ లో చూశారు. నా పెట్ నేమ్ ఆసక్తికరంగా నంది. . అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అయాన్ నంది అస్త్రం తాలూకా శక్తిని అద్భుతంగా చూపించాడు. ఎగ్జయిట్ చేసిందని అన్నారు.
ఇక్కడ చాలా మంది 'శివులు' ఉన్నారు. ఒకరు ఈ చిత్రంలో శివగా నటించిన రణబీర్. నాగార్జున గారు ఒక శివ. భారతదేశ చరిత్రలో గొప్ప చిత్రాలలో ఒకటైన 'శివ' గురించి రాజమౌళి ప్రస్థావించడం ఆసక్తికరం. నాగార్జున- శివ బంధం విడదీయరానిదని అన్నారు. నా పేరు శివ అని కూడా అర్థం. కాబట్టి సినిమాలో మూడు శివాలున్నాయి.. అంటూ ఛమత్కరించారు.
కథానాయకుడు రణబీర్ కపూర్ ని రాజమౌళి మెచ్చుకున్నారు. ఒకసారి ముంబైలో RRR ప్రమోషన్స్ లో మేము కలుసుకున్నాం. తారక్ (Jr NTR) నన్ను రణ్ బీర్ చిత్రం రాక్ స్టార్ (2011) పాటలు పెట్టమని అడిగాడు. తారక్ పాటలు పాడటం ప్రారంభించాడు. టెలివిజన్ లో రణబీర్! గదిలో రణబీర్ ఉన్నాడు అదే సమయంలో. అతను ఆశ్చర్యపోయాడు! ఆ పాట హిందీలో కూడా లేదు. ఇది కాశ్మీరీ భాషలో ఉంది. నేను అనుకుంటున్నాను. తారక్ పాడిన పాట ఇది! అంటూ సరదాగా నవ్వేశారు. అయాన్ ముఖర్జీలో రాజమౌళి తనని తాను చూసుకున్నానని రాజమౌళి అన్న మాట తనపై ఎంతో బాధ్యతను పెంచిందనడంలో సందేహం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.