తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న వారు కనీసం అయిదు నుండి పది సంవత్సరాల పాటు స్టార్ డంను కంటిన్యూ చేస్తూ కెరీర్ ను రాణించారు, రాణిస్తూనే ఉన్నారు. త్రిష - తమన్నా - సమంత వంటి వారు చాలా సంవత్సరాలుగా స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతూనే ఉన్నారు. కాని రెండు సంవత్సరాల క్రితం ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం చాలా తక్కువ సమయంలోనే తన స్టార్ డంను కోల్పోయిందని చెప్పుకోక తప్పదు. రెండు మూడు సంవత్సరాల క్రితం రకుల్ ప్రీత్ సింగ్ వరుసగా స్టార్ హీరోల చిత్రాలతో బిజీగా ఉంది. ఒకానొక సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు డేట్లు ఇచ్చేందుకు కూడా వీలు పడని పరిస్థితి. అంతటి బిజీ హీరోయిన్ కాస్త ప్రస్తుతం ఛాన్స్ ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి.
ఎంత స్పీడ్ గా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుందో అంతే స్పీడ్ గా రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. తెలుగులో దాదాపుగా ఈమెకు స్టార్స్ నుండి ఆఫర్ లు లేవని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా ఒక స్టార్ హీరో చిత్రంలో ఈమెను హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఆ హీరో ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తి అవ్వగానే కొత్త సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాలో ఖచ్చితంగా రకుల్ ప్రీత్ సింగ్ కు ఛాన్స్ దక్కనుండని, నిర్మాతలు ఇప్పటికే ఆమెకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు అంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపించింది. దాదాపు సంవత్సరంన్నర క్రితమే రకుల్ తో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. ఆ చిత్రం తర్వాత మళ్లీ తాను బిజీ అవుతాను అంటూ నమ్మకంగా రకుల్ ప్రీత్ సింగ్ ఇన్నాళ్లు ఉందట. కాని తాజాగా స్థానంలోకి మరో స్టార్ హీరోయిన్ రావడంతో రకుల్ ఆశలు అడియాశలు అయ్యాయి.
తెలుగులో ఇప్పటికే తన క్రేజ్ కు తగ్గ పాత్రలు కాకుండా చిన్న పాత్రలు - చిన్న చిత్రాలు అయినా చేసేందుకు ఓకే చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్ మరో వైపు తమిళనాట కూడా ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ కూడా ఈమెకు ఇదే పరిస్థితి ఎదురవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి రకుల్ ప్రీత్ సింగ్ కేవలం రెండు సంవత్సరాలు హడావుడి చేసి కనిపించకుండా పోతుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ ప్రేక్షకులకు నేను బోర్ అనిపిస్తే స్వయంగా నేను ఇండస్ట్రీని విడిచి వెళ్లి పోతాను అంటూ చెప్పుకొచ్చింది. సినిమా నిర్మాతలు మరియు హీరోలు ఈమెను వద్దు అంటున్నారు అంటే ఈమె బోర్ కొట్టినట్లేగా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ మళ్లీ ఊపందుకోవడం దాదాపు అసాధ్యం అనే అభిప్రాయం సినీ వర్గాల వారు మరియు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.